Breaking News

షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

Published on Fri, 11/07/2025 - 16:54

మాజీ భార్య హసీన్‌ జహాతో (‍Hasin Jahan) విభేదాల కారణంగా టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) మరోసారి వార్తల్లోకెక్కాడు. తనకు లభిస్తున్న భరణం​ సరిపోవట్లేదని హసీన్‌ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని (Supreme Court) ఆశ్రయించింది. 

హసీన్‌ పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు షమీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు షమీ హసీన్‌కు రూ. 4 లక్షలు భరణంగా చెల్లిస్తున్నాడు. ఇందులో షమీ కూతురికి రూ. 2.5 లక్షలు, హసీన్‌కు రూ. 1.5 లక్షలు వెళ్తున్నాయి. అయితే ఈ మొత్తం సరిపోవట్లేదని హసీన్‌ షమీపై మరోసారి కోర్టుకెక్కింది. 

గతంలోనూ ఇదే విషయంలో ట్రయల్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హసీన్‌ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు లభించే భరణాన్ని రూ. 1.3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచారు. తాజాగా ఈ మొత్తం కూడా సరిపోవట్లేదని హసీన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

హసీన్‌ తరఫున న్యాయవాదులు శోభా గుప్తా, శ్రీరామ్ పరాకట్ వాదిస్తూ.. షమీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. నెలకు రూ. 1.08 కోటి ఖర్చు చేస్తున్నాడు. కానీ భార్య, కుమార్తెను పేదరికంలో వదిలేశాడు. 

షమీ ఆస్తుల నికర విలువ సుమారు రూ. 500 కోట్లు ఉంటుంది. హసీన్‌కు స్వతంత్ర ఆదాయ వనరులేదు. ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో కూడా లేదని అన్నారు. షమీ తమ క్లయింట్‌కు ఇంకా  రూ. 2.4 కోట్ల బకాయిలు చెల్లించేది ఉందని తెలిపారు.  

లాయర్ల వాదన విన్న తర్వాత కోర్టు హసీన్‌కు పరోక్షంగా చురకలంటించ్చినట్లు తెలుస్తుంది. నెలకు రూ. 4 లక్షల భరణం చాలా పెద్ద మొత్తం కదా అని ప్రశ్నించినట్లు సమాచారం​. కాగా, షమీ-హసీన్‌ల వివాహం 2014లో జరిగింది. నాలుగేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. వీరిద్దరికి ఓ బిడ్డ జన్మించింది.

ఆతర్వాత షమీ-జహా మధ్య విభేదాలు తలెత్తాయి. 2018లో హసీన్‌ షమీపై గృహ హింస, వేధింపుల కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఈ ఏడాది జులైలో కోల్‌కతా హైకోర్టు రూ. 4 లక్షల భరణం హసీన్‌కు  చెల్లించాలని షమీని ఆదేశించింది.  

చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్‌ జోక్యంతో షమీ యూటర్న్‌?

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)