Breaking News

పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ప‌సి కూన‌..

Published on Fri, 09/12/2025 - 21:51

ఆసియాకప్‌-2025లో దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు ఒమ‌న్ బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. పాక్ బ్యాట‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ హ‌రిస్ మిన‌హా మిగితా బ్యాట‌ర్లు ఎవ‌రూ త‌మ స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 160 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. తొలి ఓవ‌ర్‌లోనే ఇన్ ఫామ్ బ్యాట‌ర్ సైమ్ అయూబ్ గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత మ‌హ్మ‌ద్ హ‌రిస్‌(43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 66).. సాహిబ్జాదా ఫర్హాన్(29 బంతుల్లో 29)తో క‌లిసి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. 

ఫర్హాన్ దాదాపు 10 ఓవ‌ర్ల పాటు క్రీజులో ఉన్నప్ప‌టికి బ్యాట్ ఝూళిపించ‌లేక‌పోయాడు. త‌న చెత్త బ్యాటింగ్‌తో జ‌ట్టుకు భారంగా మారాడు. అత‌డు ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన ఫ‌ఖార్ జ‌మాన్(16 బంతుల్లో 23) తన మార్క్‌ చూపించలేకపోయాడు. 

కెప్టెన్‌ సల్మాన్‌ అలీ అఘా అయితే తొలి బంతికే గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఆఖరిలో మహ్మద్‌ నవాజ్‌(10 బంతుల్లో 19) కాస్త దూకుడుగా ఆడాడు. ఇక ఒమన్‌ బౌలర్లలో షా ఫైజల్, అమీర్ కలీం తలా మూడు వికెట్లు తీయగా.. నదీమ్ ఒక్క వికెట్ తీశాడు.

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు