Breaking News

ఆర్సీబీకి ఆడాలని ఆరాటపడుతున్న పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌

Published on Sat, 03/08/2025 - 15:27

పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మొహమ్మద్‌ అమీర్‌ ఐపీఎల్‌ ఆడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ప్రత్యేకించి ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటున్నాడు. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు సరిగ్గా లేని కారణంగా పాక్‌ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఎంట్రీ లేని విషయం తెలిసిందే. అయితే అమీర్‌ బ్రిటన్‌ పౌరసత్వం పొంది తన ఐపీఎల్‌ కల నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. అమీర్‌కు 2026 నాటికి యూకే పాస్ట్‌పోర్ట్‌ వస్తుంది. అప్పుడు ఐపీఎల్‌ వేలంలో తన పేరును రిజిస్టర్‌ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

విరాట్‌ అంటే అమితమైన అభిమానం
ఎడమ చేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌ అయిన అమీర్‌కు విరాట్‌ కోహ్లి అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని అమీర్‌ చాలా సందర్భాల్లో చెప్పాడు. 2016 టీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి తనకు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని అమీర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంగా అమీర్‌ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ప్రతిభను ఆరాధించే వ్యక్తి అని కొనియాడాడు. 

కోహ్లి తనకు బ్యాట్‌ ఇచ్చినప్పుడు ఉప్పొంగిపోయానని చెప్పుకొచ్చాడు. తాను కోహ్లి బ్యాటింగ్‌ను ఆరాధిస్తానని.. కోహ్లి తన బౌలింగ్‌ను గౌరవిస్తాడని తెలిపాడు. కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తో చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడానని గుర్తు చేసుకున్నాడు. 

అమీర్‌ ఆర్సీబీలో చేరితే ఆ జట్టు టైటిల్‌ కల నెరవేరుతుందని మరో పాకిస్తాన్‌ ఆటగాడు అహ్మద్‌ షెహజాద్‌ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ బౌలింగ్‌ సమస్యలు పరిష్కరించడానికి అమీర్‌ లాంటి బౌలర్‌ అవసరమని షెహజాద్‌ అన్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఎల్లప్పుడూ బలంగా ఉంది. వారికి బౌలింగే పెద్ద సమస్య. అమీర్ వారితో చేరితే వారు టైటిల్ గెలుస్తారని షెహజాద్ జోస్యం​ చెప్పాడు.

కాగా, 32 ఏళ్ల అమీర్‌ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తిరిగి 2024లో (టీ20 ప్రపంచకప్‌ కోసం) రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే 2024 ప్రపంచకప్‌ కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అమీర్‌ను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అమీర్‌ ప్రపంచవ్యాప్తంగా వివిథ లీగ్‌ల్లో (ఐపీఎల్‌ మినహా) ఆడుతున్నాడు.

ఇదిలా ఉంటే, ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌తో తలపడనుంది. మార్చి 22న జరిగే ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగనుంది.  ఈ ఏడాది ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా మధ్యప్రదేశ్‌ ఆటగాడు రజత్‌ పాటిదార్‌ ఎంపికయ్యాడు. గత రెండు సీజన్లలో సారథ్యం వహించిన డుప్లెసిస్‌ను ఆర్సీబీ మెగా వేలానికి ముందు వదులుకుంది.

ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..
రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, టిమ్‌ డేవిడ్‌,స్వస్థిక్‌ చికార, కృనాల్‌ పాండ్యా, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మనోజ్‌ భాండగే, జేకబ్‌ బేతెల్‌, రొమారియో షెపర్డ్‌, స్వప్నిల్‌ సింగ్‌, మోహిత్‌ రతీ, ఫిలిప్‌ సాల్ట్‌, జితేశ్‌ శర్మ, జోష్‌ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, లుంగి ఎంగిడి, రసిక్‌ దార్‌ సలామ్‌, సుయాశ్‌ శర్మ, యశ్‌ దయాల్‌, నువాన్‌ తుషార, అభినందన్‌ సింగ్‌

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ షెడ్యూల్‌
మార్చి 22- కేకేఆర్‌తో
మార్చి 28- సీఎస్‌కే
ఏప్రిల్‌ 2- గుజరాత్‌
ఏప్రిల్‌ 7- ముంబై
ఏప్రిల్‌ 10- ఢిల్లీ
ఏప్రిల్‌ 13- రాజస్థాన్‌
ఏప్రిల్‌ 18- పంజాబ్‌
ఏప్రిల్‌ 20- పంజాబ్‌
ఏప్రిల్‌ 24- రాజస్థాన్‌
ఏప్రిల్‌ 27- ఢిల్లీ
మే 3- సీఎస్‌కే
మే 9- లక్నో
మే 13- సన్‌రైజర్స్‌
మే 17- కేకేఆర్‌

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)