Breaking News

డుప్లెసిస్‌ ధనాధన్‌ శతకం.. ఫెరీరా మెరుపు హాఫ్‌ సెంచరీ.. ఎంఐకి ఓటమి

Published on Mon, 06/30/2025 - 09:42

టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (Faf Du Plesis) విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. ఎంఐ న్యూయార్క్‌ జట్టుతో మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 103 పరుగులు బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి సూపర్‌ కింగ్స్‌ను గెలిపించాడు.

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2025 (MLC-2025)లో భాగంగా టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ ఎంఐ న్యూయార్క్‌ జట్టుతో తలపడింది. డల్లాస్‌ వేదికగా సోమవారం ఉదయం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బౌలింగ్‌ చేసింది.

డుప్లెసిస్‌ ధనాధన్‌ శతకం.. ఫెరీరా మెరుపు హాఫ్‌ సెంచరీ
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ స్మిత్‌ పటేల్‌ మూడు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్‌, కెప్టెన్‌ డుప్లెసిస్‌ సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు.

డుప్లెసిస్‌కు తోడుగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయితేజ ముక్కామల్ల (18 బంతుల్లో 25), మార్కస్‌ స్టొయినిస్‌ (22 బంతుల్లో 25) రాణించగా.. డొనోవాన్‌ ఫెరీరా (Donovan Ferreira) మెరుపు హాఫ్‌ సెంచరీ (20 బంతుల్లో 53) సాధించాడు. సేవేజ్‌ రెండు పరుగులతో డుప్లెసిస్‌తో కలిసి అజేయంగా నిలిచాడు.

ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 223 పరుగులు సాధించింది. ఎంఐ బౌలర్లలో జార్జ్‌ లిండే, రుషిల్‌ ఉగార్కర్‌ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్‌ 184 పరుగులకే కుప్పకూలింది.

పొలార్డ్‌ అర్ధ శతకం వృథా
ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (35), ఆరో నంబర్‌ బ్యాటర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (26) ఫర్వాలేదనిపించగా.. కీరన్‌ పొలార్డ్‌ అర్ధ శతకం (39 బంతుల్లో 70)తో అలరించాడు. అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం అందలేదు. ఫలితంగా 20 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఎంఐ న్యూయార్క్‌ తొమ్మిది వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది. తద్వారా సూపర్‌ కింగ్స్‌ చేతిలో 39 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అకీల్‌ హుసేన్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. నండ్రీ బర్గర్‌, మార్కస్‌ స్టొయినిస్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక ఈ సీజన్‌లో సూపర్‌ కింగ్స్‌కు ఏడింట ఇది ఐదో విజయం కాగా.. ఎంఐ న్యూయార్క్‌ మాత్రం ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచింది. సూపర్‌ కింగ్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. ఎంఐ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది.

 

 

చదవండి: నితీశ్‌ రెడ్డి కాదు!.. శార్దూల్‌ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్‌

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు