Breaking News

సెమీస్‌లో సారా ఎరాని–వావసోరి జోడీ

Published on Wed, 08/20/2025 - 04:24

న్యూయార్క్‌: టెన్నిస్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌లో మంగళవారం మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్‌ మొదలైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ జోడీ సారా ఎరాని–ఆండ్రియా వావసోరి (ఇటలీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ముందుగా తొలి రౌండ్‌లో ఎరాని–వావసోరి ద్వయం 4–2, 4–2తో రెండో సీడ్‌ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్‌)–టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) జంటపై గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ఆ వెంటనే జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఎరాని–వావసోరి జోడీ 4–1, 5–4 (7/5)తో ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)–రుబ్లెవ్‌ (రష్యా) జంటను ఓడించి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 

56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 4–1తో నెగ్గిన ఇటలీ జోడీ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో దక్కించుకుంది. రెండో సెట్‌లో స్కోరు 4–4తో సమం కావడంతో టైబ్రేక్‌ను నిర్వహించారు. టైబ్రేక్‌లో ముందుగా ఏడు పాయింట్లు గెలిచిన ఎరాని–వావసోరి జంట విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు స్వియాటెక్‌ (పోలాండ్‌)–కాస్పర్‌ రూడ్‌ (నార్వే) జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 

క్వార్టర్‌ ఫైనల్లో స్వియాటెక్‌–రూడ్‌ జంట 4–1, 4–2తో కేటీ మెక్‌నాలీ (అమెరికా) –ముసెట్టి (ఇటలీ) జోడీపై గెలిచింది. అంతకుముందు తొలి రౌండ్‌లో స్వియాటెక్‌–రూడ్‌ 4–1, 4–2తోనే మాడిసన్‌ కీస్‌–ఫ్రాన్సిస్కో టియాఫో (అమెరికా)లపై... కేటీ మెక్‌లానీ–ముసెట్టి 5–3, 4–2తో ఒసాకా (జపాన్‌)–Vమోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) లపై గెలిచారు. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ముకోవా–రుబ్లెవ్‌ 4–2, 5–4 (7/4)తో వీనస్‌ విలియమ్స్‌–రీలీ ఒపెల్కా (అమెరికా)లపై నెగ్గారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)