Breaking News

అత్యంత అరుదైన మైలురాయిని తాకిన మిచెల్‌ స్టార్క్‌

Published on Sun, 12/21/2025 - 15:46

ఆసీస్‌ వెటరన్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 750 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. క్రికెట్‌ చరిత్రలో స్టార్క్‌కు ముందు కేవలం 12 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆసీస్‌ తరఫున కేవలం ఇద్దరే 750 వికెట్ల మార్కును తాకారు. ఇంగ్లండ్‌తో  ఇవాళ ముగిసిన మూడో యాషెస్‌ టెస్ట్‌లో స్టార్క్‌ ఈ ఘనత సాధించాడు.

ఫార్మాట్లవారీగా స్టార్క్‌ ప్రదర్శనలు..
103 టెస్ట్‌ల్లో 424 వికెట్లు
130 మ్యాచ్‌ల్లో 247 వికెట్లు
65 టీ20ల్లో 79 వికెట్లు

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
మురళీథరన్‌-1347
షేన్‌ వార్న్‌-1001
జిమ్మీ ఆండర్సన్‌-991
అనిల్‌ కుంబ్లే-956
గ్లెన్‌ మెక్‌గ్రాత్‌-949
వసీం​ అక్రమ్‌-916
స్టువర్ట్‌ బ్రాడ్‌-847
షాన్‌ పొల్లాక్‌-829
వకార్‌ యూనిస్‌-789
టిమ్‌ సౌథీ-776
రవిచంద్రన్‌ అశ్విన్‌-765
చమింద వాస్‌-761
మిచెల్‌ స్టార్క్‌-750

అడిలైడ్‌ వేదికగా ఇవాళ ముగిసిన యాషెస్‌ మూడో టెస్ట్‌లో స్టార్క్‌ 4 వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ (54) సత్తా చాటాడు. ఈ సిరీస్‌ తొలి రెండు టెస్ట్‌ల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన (7,3) నమోదు చేసిన అతను.. బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లతో (6,2) సత్తా చాటాడు.

రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్‌ బ్యాటింగ్‌లోనూ (77 పరుగులు) రాణించాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన స్టార్క్‌ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.

మూడో టెస్ట్‌లో స్టార్క్‌తో పాటు అలెక్స్‌ క్యారీ (106, 5 క్యాచ్‌లు, 72, ఓ స్టంప్‌, ఓ క్యాచ్‌) విజృంభించడంతో ఆసీస్‌ ఇంగ్లండ్‌పై 82 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్‌ మరో 2 మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో కూడా ఆసీసే విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26న మొదలవుతుంది.

చదవండి: Ashes Series 2025: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)