Breaking News

భారత్‌తో సిరీస్‌.. జింబాబ్వేకు భారీ ఎదురుదెబ్బ

Published on Thu, 07/23/2026 - 13:52

స్వదేశంలో భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ మిల్టన్ షుంబా కుడి కాలి హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు.

మంగళవారం నిర్వహించిన స్కాన్‌లలో గాయం తీవ్రత బయటపడటంతో షుంబాను జట్టు నుంచి తప్పించినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన ఇన్నోసెంట్ కైయాను జట్టులోకి తీసుకుంది. కైయా ఇప్పటికే హరారేలో జట్టుతో చేరాడు.

బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌తో షుంబా దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే భారత్‌తో సిరీస్‌కు ముందు గాయం అతని ఆశలకు గండికొట్టింది.

కైయా విషయానికొస్తే.. ఇతను చివరిసారిగా 2024 జూలైలో భారత్‌పైనే, హరారే వేదికగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై మరోసారి అవకాశం దక్కింది.

భారత్-జింబాబ్వే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇవాళ (జూలై 23) హరారేలో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లు జూలై 25, 26 తేదీల్లో ఇదే వేదికపై జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)