Breaking News

ఈసారి గెలిచేది ఆ జట్టే! అంతలేదు కేకేఆర్‌ ఫ్యాన్‌గా చెప్తున్నా ట్రోఫీ సన్‌రైజర్స్‌దే!

Published on Thu, 03/30/2023 - 14:24

IPL 2023 Winner Prediction: క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో మార్చి 31న ఐపీఎల్‌- 2023 ఆరంభం కానుంది. టైటిల్‌ కోసం పది జట్ల మధ్య జరిగే పోరు అభిమానులకు వినోదం పంచనుంది. మొత్తంగా 74 మ్యాచ్‌లతో వేసవిలో మంచి ఎంటర్టైన్‌మెంట్‌ అందించనుంది.

ఇక గతేడాది ఎవరూ ఊహించని రీతిలో అరంగేట్ర జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మేటి జట్లకు షాకిస్తూ హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ ఫైనల్లో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. మరో కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌ సైతం ప్లే ఆఫ్స్‌ చేరి సత్తా చాటింది.

ముంబై, చెన్నై దారుణంగా..
అయితే, ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరీ ఘోరంగా  పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలవగా.. నాలుగుసార్లు ట్రోఫీ సాధించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొమ్మిదో స్థానంతో ముగించింది. ఇక సంజూ శాంసన్‌ సారథ్యంలోని రాజస్తాన్‌ రెండోసారి ఫైనల్‌ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఈసారి వైఫల్యాలు అధిగమించి మరోసారి సత్తా చాటాలని మాజీ చాంపియన్లు చెన్నై, ముంబై పట్టుదలగా ఉండగా.. మిగిలిన జట్లు సైతం టైటిల్‌ గెలిచే దిశగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ట్రోఫీ వాళ్లదే
ఐపీఎల్‌-2023 విజేతను అంచనా వేస్తూ.. ‘‘ఐపీఎల్‌ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆతురతగా ఎదురుచూస్తున్నా... ఈ ఏడాది రాజస్తాన్‌ రాయల్స్‌దే.. ఈసారి వాళ్లే ట్రోఫీ గెలుస్తారు..’’ అని వాన్‌ ట్వీట్‌ చేశాడు. ఇందుకు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

కేకేఆర్‌ ఫ్యాన్‌గా చెప్తున్నా గెలిచేది సన్‌రైజర్స్‌!
‘‘రాజస్తాన్‌ గెలిచే అవకాశం లేదు’’ అని ఓ యూజర్‌ పేర్కొనగా.. మరో నెటిజన్‌.. ‘‘నేను కేకేఆర్‌ అభిమానిని.. అయితే ఈసారి సన్‌రైజర్స్‌ టైటిల్‌ గెలుస్తుందని అనుకుంటున్నా’’ అని కామెంట్‌ చేశారు. కాగా మే 28నాటి ఫైనల్‌తో ఐపీఎల్‌-2023 విజేత ఎవరో తేలనుంది.

చదవండి: IPL 2023: వీళ్లకిదే తొలిసారి! తలపండినోళ్లకు తక్కువే! వారికి మాత్రం కళ్లు చెదిరే మొత్తం.. కోట్లలో..
హద్దు మీరి.. అభ్యంతరకరంగా! నెట్టింట షారుక్‌, కోహ్లి ఫ్యాన్స్‌ రచ్చ! ఎందుకురా తన్నుకుంటారు?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)