Breaking News

IPL 2026: ‘మా కారు ట్రక్కు కిందకి దూసుకెళ్లింది’

Published on Fri, 06/05/2026 - 17:15

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ షాకింగ్‌ విషయం వెల్లడించాడు. ఐపీఎల్‌-2026 ఫైనల్‌ ముగిసిన తర్వాత తాను ఘోరమైన ప్రమాదం బారినపడ్డాడనన్నాడు. దేవుడి దయ, భారత ప్రజల మంచితనం వల్ల సురక్షితంగా ఇంటికి చేరుకున్నానని తెలిపాడు.

రెండోసారి టైటిల్‌ గెలిచిన ఆర్సీబీ
కాగా మార్చి 28- మే 31 మధ్య ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)- గుజరాత్‌ టైటాన్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో టైటాన్స్‌ను చిత్తు చేసి ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్‌ గెలిచింది.

ఈ మ్యాచ్‌ కామెంట్రీ బృందంలో మైకేల్‌ క్లార్క్‌ కూడా భాగం. ఫైనల్‌ ముగిసిన తర్వాత అతడు నరేంద్ర మోదీ స్టేడియం నుంచి విమానాశ్రయానికి కారులో బయల్దేరాడు. కొద్దిదూరం వెళ్లగానే కారు ఘోర ప్రమాదానికి గురైంది. అప్పటికి క్లార్క్‌ నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా శబ్దం రావడంతో నిద్రలేవగా.. అప్పటికే కారు ఓ ట్రక్కు కిందకి వెళ్లిపోయింది.

మా కారు ట్రక్కు కిందకి దూసుకువెళ్లింది
ఈ చేదు ఘటన గురించి మైకేల్‌ క్లార్క్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. బియాండ్‌23 క్రికెట్‌ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘ముందుగా ఆ దేవుడికి  ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇండియాలో ఇంత మంచి వ్యక్తులు ఉన్నందుకు ఆయనకు థాంక్యూ చెప్పాల్సిందే. వారి వల్లే నేను సురక్షితంగా మా ఇంటికి వెళ్లగలిగాను.

ఆరోజు నేను కారులో నిద్రపోతున్నాను. అలసట వల్ల ఒళ్లు తెలీకుండా నిద్రపట్టేసింది. ఒక్కసారిగా శబ్దం వచ్చింది. లేచి చూసే సరికి మా కారు ఓ ట్రక్కు కిందకి దూసుకువెళ్లింది. డ్రైవర్‌ అప్పుడు నాకు జరిగిన విషయం చెప్పాడు.

ట్రక్కు బ్రేక్‌ లైట్లు కనిపించకపోవడం వల్ల తాను కన్ఫ్యూజ్‌ అయ్యానన్నాడు. అందుకే వెనుక నుంచి మా కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రక్కు కిందకి దూసుకువెళ్లిపోయింది. నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి.

కాలు విరిగిపోయింది!
అయితే, మా డ్రైవర్‌ కాలు మాత్రం విరిగిపోయే ఉంటుంది. అతడు చాలా భయపడ్డాడు. అది అతడి సొంతకారు కూడా కాదు. పాపం కంపెనీ తరఫున కారు నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు.

విషయం తెలియగానే చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చి సాయం చేశారు. ఇక బీసీసీఐకి చెందిన ప్రతి ఒక్కరు నా బాగోగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. నిజంగా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను.

చాలా భయపడిపోయాను
అదొక ఘోర ప్రమాదం. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉండొచ్చు. అయితే, నేను మాత్రం చాలా భయపడిపోయాను. నిద్రలో ఉన్నవాడిని లేచి చూసే సరికి ట్రక్కు కింద ఉంటే ఎవరైనా కంగారు పడతారు కదా!’’ అని మైకేల్‌ క్లార్క్‌ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.

చదవండి: అతడికి అన్యాయం: గంభీర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)