Breaking News

బ్రెస్‌వెల్‌ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా

Published on Thu, 01/19/2023 - 08:05

హైదరాబాద్‌ వేదికగా భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి వన్డే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్‌ మజా అందించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఓ దశలో టీమిండియా సునయాసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అటువంటి సమయంలో న్యూజిలాండ్‌ లోయార్డర్‌ బ్యాటర్‌ మైఖేల్‌ బ్రెస్‌వెల్‌ తన సంచలన ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు చెమటలు పట్టించాడు.

ఈ మ్యాచ్‌లో కేవలం 78 బంతులు ఎదుర్కొన్న బ్రెస్‌వెల్‌ 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 పరుగులు సాధించాడు. అయితే ఆఖరి ఓవర్‌లో శార్థూల్‌ ఠాకూర్‌ అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన బ్రెస్‌వెల్‌ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

ఛేజింగ్‌లో ఏడు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే విధంగా లోయార్డర్‌లో(ఏడో లేదా అంతకంటే తక్కువ)బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన మూడో ఆటగాడిగా శ్రీలంక ఆల్‌రౌండర్‌ తిషార పెరీరాతో కలిసి బ్రెస్‌వెల్‌ సంయుక్తంగా నిలిచాడు.
చదవండి: IND VS NZ 1st ODI: గిల్‌ హల్‌చల్‌.. పోరాడి ఓడిన న్యూజిలాండ్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)