వీడిన మిస్టరీ.. వార్న్‌ ఆకస్మిక మరణానికి కారణం అదేనా!

Published on Thu, 06/22/2023 - 12:42

ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్‌ వార్న్‌ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే.  ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్‌లాండ్ వెకేషన్‌లో ఉన్నప్పుడు విల్లాలోనే గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం అప్పట్లో మిస్టరీగా ఉండిపోయింది. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించిన వైద్యులు వార్న్‌ గుండెపోటు వల్ల మరణించాడని ద్రువీకరించారు.

ఇక వార్న్‌ మరణం వెనుక ఉన్న మిస్టరీ తాజాగా వీడినట్లు తెలుస్తోంది. వార్న్‌ మరణానికి కారణం గుండెపోటు అయినప్పటికి పరోక్షంగా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకోవడమేనని భారత సంతతికి చెందిన డాక్టర్‌ ఆసీమ్‌ మల్హోత్రా తాజాగా మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. డాక్టర్‌ ఆసీమ్‌ మల్హోత్రాతో పాటు ఆస్ట్రేలియా మెడికల్‌ ప్రొఫెషనల్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ క్రిస్‌ నిల్‌ షేన్‌ వార్న్‌ మరణం వెనుక ఉన్న కారణంపై రీసెర్చీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
 
''వార్న్‌ మరణించడానికి తొమ్మిది నెలల ముందు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అయిన పీ-ఫైజర్‌(PFizer mRNA) వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వార్న్‌ తన ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోగా.. మోతాదుకు మించి ఆల్కహాల్‌ తీసుకోవడంతో పాటు స్మోకింగ్‌ చేసినట్లు తేలింది. దీనివల్ల వ్యాక్సిన్‌ ప్రభావం మందగించింది.

అందువల్ల గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోయాయి. దీనివల్లే అతను కార్డియాక్‌ అరెస్టుకు గురయ్యి చనిపోయాడు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందు కూడా ఆల్కహాల్‌, స్మోకింగ్‌ ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీలో బయోమెకానిజమ్‌ సరిగ్గా లేదు. ఇది కూడా వార్న్‌ మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ నిబంధనలు సరిగ్గా పాటించి ఉంటే మాత్రం వార్న్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉండేవని'' అభిప్రాయపడ్డారు. 

కాగా టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్‌ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్‌గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. 

చదవండి: #ShaneWarne: షేన్‌ వార్న్‌ బయోపిక్‌.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు

Videos

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)