పాక్‌ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్‌

Published on Wed, 02/11/2026 - 11:45

శ్రీలంక క్రికెటర్‌ భనుక రాజపక్స వార్తల్లోకెక్కాడు. గతేడాది నవంబరులో చివరగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు ఈ లెఫ్టాండర్‌. పేలవ ప్రదర్శనల కారణంగా టీ20 ప్రపంచకప్‌-2026 శ్రీలంక జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు.

అదనంగా ఓ రబ్బరు పొర 
అయితే, ఆటతో కాకుండా భారత బ్యాటర్ల గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా భనుక రాజపక్స పేరు తెరమీదకు వచ్చింది. స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా ఆటగాళ్లు వాడే బ్యాట్లు మిగతా జట్లు వాడే బ్యాట్ల కంటే ఎంతో మిన్నగా ఉంటాయని అన్నాడు. వారి బ్యాట్లపై అదనంగా ఓ రబ్బరు పొర కూడా ఉంటుందని పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో భనుక రాజపక్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ పాకిస్తాన్‌ జట్టు అభిమానులు నెట్టింట రచ్చ చేశారు. భారత బ్యాటర్ల ఆటను కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీంతో భనుక రాజపక్స స్పందించాడు.

ప్రశంసించాలని అనుకున్నా
తన మాటల్ని వక్రీకరించి ఇష్టారీతిన ప్రచారం చేయడం సరికాదని హితవు పలికాడు. ‘‘అందరికీ హాయ్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారు. వారు తోచిన విధంగా మలచుకుని ప్రచారం చేస్తున్నారు. బహుశా అనువాదం చేయడంలో వారు పొరపడి ఉంటారు.

నేను భారత బ్యాటర్లను ప్రశంసించే క్రమంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. భారత క్రికెట్‌ ఎంతో అభివృద్ధి చెందింది. వారి వద్ద అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, మౌలిక సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలు కలిగిన క్రికెట్‌ పరికరాలు ఉన్నాయి.

ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ల కోసం బ్యాట్లు తయారుచేసే​ మ్యాన్‌ఫ్యాక్చరర్స్‌ ప్రపంచంలోనే అత్యుత్తమైన వారు. ఈ విషయంలో స్పష్టత వచ్చిందనే అనుకుంటున్నా.

కౌంటర్‌ అదుర్స్‌
నాకు వారి పట్ల గౌరవం తప్ప ఇంకేమీ లేదు’’ అని భనుక రాజపక్స సోషల్‌ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో షాకవ్వడం పాక్‌ ఫ్యాన్స్‌ వంతైంది. మరోవైపు.. టీమిండియా అభిమానులు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించిన వారికి భనుక రాజపక్స మంచి కౌంటర్‌ ఇచ్చాడని పేర్కొంటున్నారు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌తో కలిసి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. ఇదిలా ఉంటే.. భనుక రాజపక్స తన కెరీర్‌లో 5 వన్డేలు, 45 టీ20 ఆడాడు. 34 ఏళ్ల ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఖాతాలో 89 వన్డే, 744 టీ20 పరుగులు ఉన్నాయి.

చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్‌!.. ఈసారి..

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)