Breaking News

కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్‌

Published on Fri, 04/25/2025 - 13:33

రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది ఆటగాళ్లు.. అంతే త్వరగా కనుమరుగైపోయిన దాఖలాలు ఉన్నాయన్నాడు. కాబట్టి వైభవ్‌ ఆచితూచి అడుగేస్తూ కెరీర్‌ ప్లాన్‌ చేసుకోవాలని సూచించాడు.

రూ. 1.10 కోట్లకు
దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన పద్నాలుగేళ్ల వైభవ్‌ సూర్యవంశీని ఐపీఎల్- 2025 (IPL 2025) మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 1.10 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఇటీవల లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఇచ్చింది.

తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు
కెప్టెన్‌ సంజూ శాంసన్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో వైభవ్‌ వచ్చాడు. టీమిండియా స్టార్‌ యశస్వి జైస్వాల్‌తో కలిపి రాజస్తాన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన క్రికెటర్‌గా చరిత్రకెక్కిన ఈ బిహార్‌ కుర్రాడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు.

అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్ల జాబితాలో వైభవ్‌ చేరిపోయాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 34 పరుగులు సాధించాడు. ఇక తాజాగా గురువారం ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ వైభవ్‌ దూకుడుగానే ఆడాడు. రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నిష్క్రమించాడు.

కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్‌ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు
ఈ పరిణామాల నేపథ్యంలో వీరేందర్‌ సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘బాగా ఆడితే ప్రశంసిస్తారని.. ప్రదర్శన బాగా లేకుంటే విమర్శిస్తారని తెలిసిన ఆటగాడు గర్వం తలకెక్కించుకోకుండా ఉంటాడు. అతడి కాళ్లు భూమ్మీదే ఉంటాయి.

కానీ చాలా మంది ఆటగాళ్లు.. ఒకటీ- రెండు మ్యాచ్‌ల ద్వారా ఫేమస్‌ అయిన వెంటనే దారి తప్పుతారు. తాము స్టార్‌ ప్లేయర్‌ అయిపోయామనే భ్రమలో ఆ తర్వాత కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతారు.

ఇక సూర్యవంశీ విషయానికొస్తే.. అతడు మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్‌ ఆడాలనే లక్ష్యంతో ఉండాలి. విరాట్‌ కోహ్లిని చూడండి.. తను 19 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటికి 18 సీజన్లు పూర్తి చేసుకున్నాడు.

కోహ్లి మాదిరే సూర్యవంశీ ఎదిగేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సాధించిన దానితో సంతోషపడి.. నేను కోటీశ్వరుడిని.. నా అరంగేట్రమే అద్భుతం.. తొలి బంతికే సిక్స్‌ కొట్టాను.. అనే ఆలోచనలతో ఉంటే.. బహుశా వచ్చే ఏడాది మనం అతడిని చూసే అవకాశం ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆఖరి వరకు పోరాడి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో సొంత మైదానంలో తొలి విజయం సాధించగా.. రాజస్తాన్‌ తొమ్మిదింట ఏడు పరాజయాలు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: క్రెడిట్‌ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)