Breaking News

అదే తీరు.. ఈసారి పంత్‌తో పెట్టుకున్నాడు

Published on Thu, 01/13/2022 - 23:40

దక్షిణాఫ్రికా పేస్‌ బౌలర్‌ మార్కో జాన్సెన్‌ టీమిండియా ఆటగాళ్లతో వైరం కొనసాగిస్తున్నాడు. బుమ్రాతో వైరం పెట్టుకొని జాన్సెన్‌ ఫలితం అనుభవించాడు. దాని నుంచి బయటపడకముందే తన కవ్వింపు చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి మార్కో జాన్సెన్‌ తన వైరం పంత్‌తో పెట్టుకున్నాడు. టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో ఓపికతో బ్యాటింగ్‌ కొనసాగిస్తున్న పంత్‌కు మార్కో జాన్సెన్‌ షార్ట్‌ పిచ్‌ బంతి వేశాడు. పంత్‌ దానిని ఢిఫెన్స్‌ ఆడగా.. బంతిని అందుకున్న జాన్సెన్‌ కోపంతో పంత్‌వైపు విసిరి కవ్వించాడు. అసలే ఉడుకురక్తంతో కనిపించే పంత్‌ను గెలకడం కాస్త ఆసక్తి కలిగించింది.

అయితే పంత్‌ మాత్రం తన శైలికి విరుద్ధంగా బంతికి బ్యాట్‌ను అడ్డుపెట్టి గాయం కాకుండా తనను తాను కాపాడుకున్నాడు. ఈ క్రమంలో వీరిమధ్య ఏదైనా గొడవ జరుగుతుందేమోనని అంతా భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం​ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్‌ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పటికి.. ఒకవేళ​ ప్రొటీస్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో మార్కో జాన్సెన్‌ బ్యాటింగ్‌కు వస్తే.. వికెట్ల వెనకాల పంత్‌ కీపర్‌గా ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 

ఇక 212 పరుగుల ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. మూడో రోజు ఆఖరి బంతికి ఎల్గర్‌(30) ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌ క్యాచ్‌కు ఇచ్చి ఎల్గర్‌ వెనుదిరిగాడు. క్రీజ్‌లో కీగన్‌ పీటర్సన్‌(48) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలవాలంటే మరో 111 పరుగులు అవసరం కాగా, టీమిండియా 8 వికెట్లు పడగొడితే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. 

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)