Breaking News

మరో సూపర్‌ జెయింట్.. పేరు మార్చుకున్న మరో ఫ్రాంచైజీ

Published on Fri, 01/16/2026 - 08:52

ఫ్రాంచైజీ క్రికెట్‌లోకి మరో సూపర్‌ జెయింట్‌ వచ్చింది. హండ్రెడ్‌ లీగ్‌లో మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌గా మారింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇప్పటికే రెండు సూపర్‌ జెయింట్స్‌ ఉన్నాయి. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌. ఈ రెండు సహా మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధినేత సంజీవ్‌ గొయెంకా చేతుల్లో ఉన్నాయి.

మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌గా రూపాంతరం​ చెందిన తర్వాత కొత్త లోగోను గురువారం​ ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో ఇంగ్లండ్‌ స్టార్‌ వికెట్‌కీపర్‌ జోస్‌ బట్లర్‌ (పురుషుల హండ్రెడ్‌), అదే దేశానికి చెందిన స్పిన్‌ బౌలర్ సోఫీ ఎక్ల్‌స్టోన్ (మహిళల హండ్రెడ్‌)ను రిటైన్‌ చేసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. బట్లర్‌ మరో సూపర్‌ జెయింట్‌లోనూ (డర్బన్ సూపర్ జెయింట్స్) భాగంగా ఉన్నాడు.

లక్నో, డర్బన్ సూపర్‌ జెయింట్స్‌ లోగోల్లోని బ్రాండింగ్‌కి భిన్నంగా మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ లోగోలో ఏనుగు ప్రతీక ఉండటం గమనించదగ్గ విష​యం. మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా మాట్లాడుతూ.. మాంచెస్టర్ ఒక గొప్ప క్రీడా నగరం. సూపర్ జెయింట్స్ కుటుంబంలో భాగమవ్వడం గర్వకారణం. జోస్ బట్లర్ వంటి ఆటగాళ్లు మా జట్టులో ఉండటం ఆనందదాయకమిని పేర్కొన్నారు.  

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ బట్లర్‌, ఎక్లెస్టోన్‌తో పాటు మరికొంత మందిని కూడా రీటైన్‌ చేసుకుంది. పురుషుల విభాగంలో హెన్రిచ్‌ క్లాసెన్‌, నూర్‌ అహ్మద్‌ను తిరిగి దక్కించుకుంది. కొత్తగా పురుషుల విభాగంలో లియామ్‌ డాసన్‌.. మహిళల విభాగంలో మెగ్‌ లాన్నింగ్‌, స్మృతి మంధనను జట్టులోకి తీసుకుంది.

కాగా, మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌గా రూపాంతరం చెందక ముందు మరో రెండు హండ్రెడ్‌ లీగ్‌ ఫ్రాంచైజీల పేర్లు మారాయి. ముంబై ఇండియన్స్‌ ఓనర్షిప్‌లో నడిచే ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఎంఐ లండన్‌గా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్షిప్‌లో నడిచే నార్తర్న్ సూపర్‌చార్జర్స్ సన్‌రైజర్స్ లీడ్స్‌గా రూపాంతరం చెందాయి.

జులై 21 నుంచి ప్రారంభం 
ది హండ్రెడ్ లీగ్‌ 2026 పురుషులు, మహిళల విభాగాల్లో జులై 21 నుంచి  ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంచైజీలకు జనవరి చివరి వరకు నాలుగు ప్రీ-ఆక్షన్ సైనింగ్‌లకు అవకాశం ఉంది. ప్రధాన ఆక్షన్ మార్చిలో జరగనుంది.  

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)