Breaking News

కౌంటీలోనూ అదే జోరు.. బౌలింగ్‌తో హడలెత్తించిన మానవ్ సుతార్‌!

Published on Sat, 06/13/2026 - 19:10

టీమిండియా తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్‌షిప్‌లోనూ తన బౌలింగ్‌తో బెంబెలె త్తిస్తు‍న్నాడు. ఆఫ్గన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. 

ఆఫ్గన్‌పై ప్రదర్శనతో కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న మానవ్ సుతార్ అక్కడ కూడా అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. వార్విక్‌షైర్ తరఫున బరిలోకి దిగిన మానవ్ సుతార్ యార్క్‌షైర్‌తో జరుగుతున్న కౌంటీ మ్యాచ్‌లో 85 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మానవ్ సుతార్ తీసిన మూడు వికెట్లు కీలకమైనవే కావడం విశేషం. 

మొదట హాఫ్ సెంచరీ చేసిన సామ్ వైట్‌మన్ (55)ను పెవిలియన్ చేర్చిన మానవ్ సుతార్.. తన సెంచరీతో యార్క్‌షైర్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచిన విలియమ్ లక్స్‌టన్ (167 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత చివర్లో యార్క్‌షైర్ భారీ స్కోరు చేయడంలో సహాయపడిన జార్జ్ హిల్ (30)ను ఔట్ చేసి ముచ్చటగా మూడో వికెట్ తీసుకున్నాడు.

ఇలా అరంగేట్రం మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లు తీసి కౌంటీ క్రికెట్‌లోనూ మానవ్ సుతార్ అదుర్స్ అనిపించాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 110.4 ఓవర్లలో 469 పరుగులకు ఆలౌటైంది. విలియం లక్స్‌టన్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ జానీ బెయిర్ స్టో (68)తో పాటు సామ్ వైట్‌మన్ అర్థసెంచరీ సాధించారు. 

మానవ్ సుతార్‌, ఈతన్ బాంబర్‌, ఎడ్ బెర్నాడ్‌లు తలా మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ​ ఆరంభించిన వార్విక్‌షైర్ 23 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. రాబర్ట్ యేట్స్ (22), సామ్ హెయిన్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు