అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం.. ఓ బౌలర్‌కు 7 వికెట్లు, అన్ని క్లీన్‌బౌల్డ్‌లే..!

Published on Wed, 07/26/2023 - 11:10

అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం చోటు చేసుకుంది. ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ ఆసియా క్వాలిఫయర్‌-బి పోటీల్లో భాగంగా చైనాతో ఇవాళ (జులై 26) జరిగిన మ్యాచ్‌లో మలేసియా బౌలర్‌ శ్యాజ్రుల్‌ ఇద్రుస్‌ (4-1-8-7) ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇద్రుస్‌ పడగొట్టిన 7 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం.

అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్‌ ఇప్పటివరకు 7 వికెట్ల ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో ఓ మొయిడిన్‌ వేసి 8 పరుగులకు 7 వికెట్లు పడగొట్టిన ఇద్రుస్‌.. టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ అయిన 32 ఏళ్ల ఇద్రుస్‌.. తన స్వింగ్‌ మాయాజాలంతో పేట్రేగిపోవడంతో చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది.

ఇద్రుస్‌తో పాటు పవన్‌దీప్‌ సింగ్‌ (4-0-9-2), విజయ్‌ ఉన్ని (1.2-1-1-1) కూడా రాణించారు. చైనా ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ చేయలేకపోగా.. ఏకంగా ఆరుగురు డకౌట్లయ్యారు. చైనా ఇన్నింగ్స్‌లో వై గులే చేసిన 7 పరుగులే అత్యధికం.

అనంతరం 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 4.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప ఛేదనలో మలేసియా బ్యాటర్లు సైతం ఆరంభంలో తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ డకౌట్లు అయ్యారు.  వన్‌డౌన్‌ బ్యాటర్‌ షార్వీన్‌ సురేంద్రన్‌ (4 నాటౌట్‌), విరన్‌దీప్‌ సింగ్‌ (19 నాటౌట్‌) మలేసియాను విజయతీరాలకు చేర్చారు. చైనా బౌలర్లలో టియాన్‌ సెన్క్వన్‌, కెప్టెన్‌ వాంగ్‌ కీ తలో వికెట్‌ పడగొట్టారు. 

అంతర్జాతీయ టీ20ల్లో టాప్‌ 10 అత్యుత్తమ గణాంకాలు..

  1. శ్యాజ్రుల్‌ ఇద్రుస్‌ (మలేసియా) (4-1-8-7)
  2. పీటర్‌ అహో (నైజీరియా) (3.4-1-5-6)
  3. దీపక్‌ చాహర్‌ (భారత్‌) (3.2-0-7-6)
  4. నక్రాని (ఉగాండ) (4-1-7-6)
  5. అజంతా మెండిస్‌ (శ్రీలంక) (4-2-8-6)
  6. జెజె స్మిట్‌ (నమీబియా) (4-1-10-6)
  7. అజంతా మెండిస్‌ (శ్రీలంక) (4-1-16-6)
  8. ఓబెడ్‌ మెక్‌కాయ్‌ (వెస్టిండీస్‌) (4-1-17-6)
  9. లాంగట్‌ (కెన్యా) (4-1-17-6)
  10. ఫెన్నెల్‌ (అర్జెంటీనా) (4-0-18-6)

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)