Breaking News

హ్యాట్సాఫ్‌ మజుందార్‌

Published on Mon, 11/03/2025 - 03:17

దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఆటలో రికార్డు స్థాయిలో పరుగులు సాధించిన తర్వాత కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించని దురదృష్టవంతుల్లో అమోల్‌ మజుందార్‌ పేరు ఉంటుంది. ముంబైకి చెందిన 51 ఏళ్ల మజుందార్‌ 171 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో 30 సెంచరీలు సహా 11,167 పరుగులు సాధించాడు. అయితే ఏనాడూ భారత్‌కు ఆడే అవకాశం రాలేదు. ఈ దేశవాళీ దిగ్గజం కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్‌లో మర్చిపోలేని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

రెండేళ్ల క్రితం మహిళల టీమ్‌కు కోచ్‌గా వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలో జట్టు ఎంతో రాటుదేలింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బలంగా నిలబడిన మజుందార్‌ జట్టుకు మద్దతుగా నిలుస్తూ తన ప్లేయర్లపై నమ్మకం ఉంచాడు. ఆయన నమ్మిన ప్లేయర్లు ఇప్పుడు దానిని నిలబెట్టారు. చాంపియన్‌గా నిలిచి కోచ్‌కు కానుక అందించారు.  

ఫైనల్‌కు ముందు వేడుకలతో 
వేదికొక్కటే మెరిసింది. స్టేడియం వెలుగుజిలుగుల సవ్వడి చేసింది. పోరు మొదలయ్యాక భారత మహిళల హోరు కొనసాగింది. మ్యాచ్‌ గెలిచాక... ప్రపంచకప్‌ చేతికందాక... యావత్‌ భారతావని పండగ చేసుకుంది. 

నడిరాతిరంతా సంతోషాల జాతర చేసుకుంది. తెల్లవారేదాకా ఊరు వాడ తేడానే లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా గెలుపు మురిపెంగా... మూడు రంగుల పతాకాలు, జయజయధ్వానాలే వినిపించాయి. కనిపించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథమహారథులంతా మహిళల విజయాన్ని వేనోళ్ల ప్రశంసలతో ముంచెత్తారు. హర్మన్‌ సేన పోరాటాన్ని ఆకాశానికెత్తారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)