Breaking News

సూపర్‌ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్‌

Published on Thu, 10/16/2025 - 17:04

ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) రంజీ ట్రోఫీ (Ranji Trophy 2025-26) తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్‌ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్న పాటిదార్‌.. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో కదంతొక్కాడు. 

పాటిదార్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇది 16వ సెంచరీ. దేశవాలీ క్రికెట్‌లో పాటిదార్‌ గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత 8 ఇన్నింగ్స్‌ల్లో అతను 3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలు చేశాడు. ఆ స్కోర్లు ఇలా ఉన్నాయి. 100*(160), 10(25), 66(132), 13(27), 101(115), 77(84), 66(72) & 125(96)

పంజాబ్‌తో మ్యాచ్‌లో పాటిదార్‌ వెంకటేశ్‌ అయ్యర్‌తో (73) కలిసి ఐదో వికెట్‌కు 147 పరుగులు జోడించాడు. 92 ఓవర్ల తర్వాత (రెండో రోజు) మధ్యప్రదేశ్‌ స్కోర్‌ 6 వికెట్ల నష్టానికి 304 పరుగులుగా ఉంది.  పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌తో పోలిస్తే 72 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది

పాటిదార్‌తో పాటు సరాన్ష్‌ జైన్‌ (2) క్రీజ్‌లో ఉన్నాడు. మధ్యప్రదేశ్‌ ఇన్నింగ్స్‌లో హిమాన్షు మంత్రి (40), శుభమ్‌ శర్మకు (41) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 232 పరుగులకు ఆలౌటైంది. సరాన్ష్‌ జైన్‌ 6 వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. కుమార్‌ కార్తికేయ, ఆర్యన్‌ పాండే, అర్షద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఉదయ్‌ సహరన్‌ (75) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. విధ్వంసకర ఆటగాడు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. 

చదవండి: విధ్వంసకర వీరుడికే ప్రతిష్టాత్మక అవార్డు.. సహచరుడు పోటీ పడినా..!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)