Breaking News

ఐపీఎల్‌-2025లో అట్ట‌ర్ ప్లాప్‌.. క‌ట్ చేస్తే! టీమిండియా లెజెండ్‌పై వేటు?

Published on Wed, 08/13/2025 - 16:27

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స‌పోర్ట్ స్టాప్‌లో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ జ‌ట్టు మెంటార్‌, టీమిండియా పేస్ బౌలింగ్ దిగ్గ‌జం జ‌హీర్ ఖాన్‌పై వేటు వేసేందుకు ల‌క్నో యాజ‌మాన్యం సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది.

గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో ల‌క్నో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లోనూ ప్లే ఆఫ్స్‌కు చేర‌డంలో ల‌క్నో విఫ‌ల‌మైంది. 14 మ్యాచ్‌ల‌లో కేవ‌లం ఆరింట మాత్ర‌మే విజ‌యం సాధించిన సూప‌ర్ జెయింట్స్‌.. పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్ధానంతో స‌రిపెట్టుకుంది.

కాగా ఐపీఎల్‌-2024 సీజ‌న్‌కు ముందు గౌత‌మ్ గంభీర్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఫ్రాంచైజీతో జ‌త క‌ట్టిన త‌ర్వాత ల‌క్నో కోచింగ్ స్టాప్‌లో జ‌హీర్ చేరాడు. ఆ ఏడాది సీజ‌న్‌నూ ల‌క్నో ఏడో స్ధానంతో ముగించింది. జ‌హీర్ మెంటార్‌గా ఉంటూనే ల‌క్నో బౌలింగ్ కోచ్ బాధ్య‌త‌లు కూడా నిర్వ‌ర్తించాడు.

అయితే జాక్ మెంటార్‌షిప్ ప‌ట్ల ల‌క్నో మెన్‌జ్‌మెంట్ ఆసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి వీడ్కోలు పలికి మరొకరిని నియమించాలని సూపర్ జైంట్స్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే లక్నో కొత్త బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్ ఎంపికయ్యాడు. త్వరలో కొత్త మెంటార్‌ను కూడా లక్నో నియమించనుంది. అంతేకాకుండా ఆర్‌పీస్‌జీ గ్రూపు ఆద్వర్యంలో ఉన్న అన్ని జట్లను పర్యవేక్షించేందుకు కొత్త క్రికెట్ డైరెక్టర్‌ను కూడా నియమించేందుకు సంజీవ్ గోయోంకా సిద్దమైనట్లు తెలుస్తోంది.

మరోవైపు భారీ అంచనాలు పెట్టుకున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ సైతం రాణించలేకపోయాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ మినహా మిగితా మ్యాచ్‌లలో పంత్ విఫలమయ్యాడు.  కాగా పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డు ధ‌ర‌కు ల‌క్నో ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన బ్రెవిస్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)