స్పిన్‌ X పేస్‌

Published on Wed, 04/01/2026 - 04:27

లక్నో: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. గతేడాది ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయిన ఈ రెండు జట్లు బుధవారం తమ తొలి మ్యాచ్‌ ఆడనున్నాయి. రిషబ్‌ పంత్‌ సారథ్యంలోని లక్నో పేపర్‌పై భీకరంగా కనిపిస్తోంది. మార్‌‡్ష, మార్క్‌రమ్‌ ఓపెనింగ్‌ చేయనుండగా... పంత్, పూరన్, బదోనీ, షహబాజ్‌ మిడిలార్డర్‌లో బరిలోకి దిగనున్నారు.

గత సీజన్‌లో ఆకట్టుకున్న స్పిన్నర్‌ దిగ్వేశ్‌ రాఠీ మరోసారి కీలకం కానుండగా... పేస్‌ బౌలింగ్‌లో షమీ, నోర్జే, అవేశ్‌ ఖాన్, మొహసిన్‌ ఖాన్, మయాంక్‌ యాదవ్‌ రూపంలో లెక్కకు మిక్కిలి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మరోవైపు అక్షర్‌ పటేల్‌ సారథ్యంలోని ఢిల్లీ జట్టు కూర్పును సరిచేసుకునే పనిలో ఉంది. కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేదెవరో చూడాలి.

మిల్లర్, నితీశ్‌ రాణా, సమీర్‌ రిజ్వీ, అశుతోష్‌ శర్మతో బ్యాటింగ్‌ బలంగానే ఉండగా... ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ స్టార్క్‌ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దేశవాళీల్లో దుమ్మురేపుతున్న అఖీబ్‌ నబీపై అందరి దృష్టి నిలవనుంది. అక్షర్, కుల్దీప్‌ స్పిన్‌ భారం మోయనున్నారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా... అందులో ఢిల్లీ నాలుగు మ్యాచ్‌లు నెగ్గగా... లక్నో మూడింట విజయం సాధించింది.

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

'పల్లి చట్టంబి' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘బ్యాండ్‌ మేళం’ మూవీ థ్యాంక్ యూ మీట్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)