Breaking News

కావ్య మారన్ సంచలన నిర్ణయం!?

Published on Sat, 11/15/2025 - 08:11

ఐపీఎల్‌-2026 సీజన్ మినీ వేలానికి ముందు భారీ ట్రేడ్ డీల్‌కు రంగం సిద్దమైంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్  (SRH) నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ట్రేడ్ చేసుకోనున్నట్లు సమాచారం. ఎస్‌ఆర్‌హెచ్‌-ఎల్‌ఎస్‌జీ మధ్య రూ. 10 కోట్ల 'ఆల్-క్యాష్ డీల్' (నగదు రూపంలో మాత్రమే చెల్లించి) ఫైనల్ అయినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది.

గత ఏడాది సీజన్ మెగా వేలంలో షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. అయితే ఈ రైట్ ఆర్మ్ పేసర్ మాత్రం తన స్ధాయికి తగ్గప్రదర్శన చేయలేకపోయాడు. 9 మ్యాచ్‌లలో 11.23 ఎకానమీ రేటుతో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇది అతడి ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ప్రదర్శన.

దీంతో అతడిని మినీ వేలంలో విడిచిపెట్టేందుకు సన్‌రైజర్స్ ఓనర్‌ కావ్యమారన్‌ సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. అంతలోనే షమీని తమ జట్టులోకి తీసుకునేందుకు సన్‌రైజర్స్ యాజమాన్యంతో లక్నో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమ జట్టులో సీనియర్ పేసర్ ఒక్కరు కూడా లేకపోవడంతో ఈ ట్రేడ్ డీల్ కోసం ఎల్‌ఎస్‌జీ  ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

లక్నో జట్టులో  మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ వంటి యువ పేసర్లు ఉన్నప్పటికి.. వారు ఫిట్‌నెస్ సమస్యలతో సతమవుతున్నారు. తాజాగా లక్నో చేసిన పోస్ట్‌ కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్‌ను షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఫోటోను లక్నో పోస్ట్‌ చేసింది. అయితే అందులో షమీ కన్పించకుండా ఎల్‌ఎస్‌జీ జాగ్రత్త పడింది.

ఆ నలుగురికి టాటా బైబై..
ఇక లక్నో సూపర్ జెయింట్స్ మినీ వేలంలో తమ పర్స్ విలువను పెంచుకోవడానికి నలుగురు ఆటగాళ్లను విడుదల చేయాలని నిర్ణయించుకుందంట. డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్‌, ఆకాష్ దీప్, షామర్ జోసెఫ్‌లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో లక్నో పర్స్ విలువ రూ.27.25 కోట్లు పెరగనుంది. కాగా ఐపీఎల్‌-2026 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్‌ను ఫ్రాంచైజీలు శనివారం (నవంబర్ 15)సాయంత్రం లోపు బీసీసీఐకి సమర్పించాలి.
చదవండి: ‘అసలే అతడు మరుగుజ్జు కదా!’.. బుమ్రా వ్యాఖ్యలపై స్పందించిన సౌతాఫ్రికా కోచ్‌!

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)