Breaking News

లక్నో సూపర్‌ జెయింట్స్‌ది రికార్డే..  ఆర్‌సీబీని మాత్రం కొట్టలేకపోయింది

Published on Fri, 04/28/2023 - 22:40

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తమ బ్యాటింగ్‌ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. కేఎల్‌ రాహుల్‌ మినహా వచ్చిన బ్యాటర్లంతా బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందు కైల్‌ మేయర్స్‌ 24 బంతుల్లోనే 54 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా.. దానిని స్టోయినిస్‌, బదోనిలు కంటిన్యూ చేశారు.

ముఖ్యంగా స్టోయినిస్‌ 40 బంతుల్లో 72 పరుగుల విధ్వంసకర ఆటతీరుతో అలరించాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. బదోని 43 పరుగులు చేసి ఔటైన తర్వాత వచ్చిన పూరన్‌ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. 19 బంతుల్లో 45 పరుగులతో తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు.


Photo: IPL Twitter

ఈ దెబ్బకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక మొదటి స్థానంలో ఆర్‌సీబీ 2013లో పుణే వారియర్స్‌పై 263 పరుగులు చేసింది. మళ్లీ మూడో స్థానంలో ఆర్‌సీబీనే ఉంది.

2016లో గుజరాత్‌ లయన్స్‌పై 248 పరుగులు, ఇక నాలుగో స్థానంలో సీఎస్‌కే 2010లో రాజస్తాన్‌పై 246 పరుగులు.. చివరిగా ఐదో స్థానంలో కేకేఆర్‌.. 2018లో పంజాబ్‌ కింగ్స్‌పై 245 పరుగులు చేసింది. ఇక లక్నోకు ఇదే ఐపీఎల్‌ అత్యధిక స్కోరు  కావడం మరో విశేషం. ఇక్కడ మరో అంశంమేమిటంటే ఐపీఎల్‌లో  ఆర్‌సీబీ రెండుసార్లు అత్యధిక స్కోర్లు ఫీట్‌ సాధించింది. అయితే 263 పరుగుల అత్యధిక స్కోరు చేసి తొలి స్థానంలో ఉన్న ఆర్‌సీబీ ఫీట్‌ను మాత్రం అందుకోవడంలో లక్నో విఫలమయింది.

ఇక లక్నో, పంజాబ్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 41 బౌండరీలు కౌంట్‌ అయ్యాయి. ఇందులో 27 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఒక మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టుగా లక్నో రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఆర్‌సీబీ 42 బౌండరీలు(21 ఫోర్లు, 21 సిక్సర్లు) ఉంది.

చదవండి: #KLRahul: త్వరగా ఔటయ్యి జట్టుకు మేలు చేశావు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు