Breaking News

ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. బంగ్లాదేశ్‌ జట్టుకు శుభవార్త

Published on Sat, 08/01/2026 - 16:52

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ ఊరట లభించింది. గాయం కారణంగా తొలుత జట్టులో చోటు దక్కని స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్, కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.

జూలై 26న ప్రకటించిన బంగ్లాదేశ్ తొలి 15 మంది సభ్యుల జట్టులో లిట్టన్ దాస్‌కు చోటు దక్కలేదు. ఎడమ కాలి కాఫ్ మసిల్‌కు గ్రేడ్-1 గాయం కావడంతో అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి.

అయితే పునరావాస ప్రక్రియలో లిట్టన్ వేగంగా కోలుకున్నాడు. అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించడంతో తొలి టెస్టుకు అతడిని జట్టులోకి చేర్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 13న డార్విన్‌లో ప్రారంభం కానుంది. రెండో టెస్ట్‌ మెక్‌కే వేదికగా ఆగస్ట్‌ 22 నుంచి మొదలవుతోంది. టెస్ట్‌ మ్యాచ్‌లకు ముందు ఆగస్ట్‌ 6-8 వరకు బంగ్లాదేశ్‌-క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవెన్‌ మధ్య మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ జరుగనుంది.

2003 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడబోతుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మాన్ ఇస్లాం, తంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాడత్ హొస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్, లిట్టన్ దాస్.

 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)