బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్

Published on Wed, 07/29/2026 - 20:49

2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా సీనియర్ బ్యాటర్ లిట్టన్ దాస్‌ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

ఇటీవలి కాలంలో మెహిదీ హసన్ మిరాజ్ సారథ్యంలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో నాయకత్వంలో మార్పు చేయాలని బోర్డు నిర్ణయించింది.

లిట్టన్ దాస్‌కు నాయకత్వ అనుభవం కూడా బాగానే ఉంది. గతంలో బంగ్లాదేశ్ వన్డే జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన, 2021 నుంచి 2026 వరకు టీ20 జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒక టెస్టులో కూడా జట్టును నడిపించాడు.

ఈ ఏడాది డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగే వన్డే సిరీస్ నుంచి లిట్టన్ దాస్ అధికారికంగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. దాస్‌ వన్డే, టీ20 జట్లకు నాయకత్వం వహించనుండగా.. నజ్ముల్‌ హసన్‌ షాంటో టెస్ట్‌ జట్టు సారధిగా ఉన్నాడు. 

బంగ్లాదేశ్‌ తాజాగా జింబాబ్వే పర్యటనలో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆగస్ట్‌లో ఈ జట్టు ఆస్ట్రేలియాలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)