Breaking News

మెస్సీ వ‌స్తున్నాడ‌ని.. హ‌నీమూన్ ర‌ద్దు

Published on Sat, 12/13/2025 - 11:02

కోల్‌క‌తా: మెస్సీ మేనియాతో ఇండియా ఊగిపోతోంది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రాక సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా అత‌డి ఫ్యాన్స్ సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు. శ‌నివారం ఉద‌యం ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తా చేరుకున్న మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అత‌డు వ‌స్తున్న దారి వెంబ‌డి నిల‌బ‌డి సంద‌డి చేశారు. అత‌డు బ‌స చేసి హోట‌ల్ ముందు గుమిగూడారు. ఇక కోల్‌క‌తా న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా మెస్సీ అభిమానుల కోలాహలం క‌నిపించింది.

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు లియోనెల్ మెస్సీ.. (Lionel Messi ) సాల్ట్ లేక్ స్టేడియంలో సంద‌డి చేయ‌నున్నారు. దీంతో ఈ ఉద‌యం నుంచే అభిమానులు భారీగా ఇక్క‌డికి చేరుకుంటున్నారు. మెస్సీని చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ త‌ర‌లివ‌చ్చారు. నేపాల్ నుంచి కూడా కొంత మంది అభిమానులు కోల్‌క‌తా చేరుకోవ‌డం విశేషం.  కొత్త‌గా పైళ్లైన ఓ జంట త‌మ హ‌నీమూన్‌ను సైతం వాయిదా వేసుకుని మెస్సీని చూసేందుకు వ‌చ్చింది.

సాల్ట్ లేక్ స్టేడియం వ‌ద్ద కొత్త జంట ఏఎన్ఐ వార్తా సంస్థ‌ల‌తో మాట్లాడింది. "గత శుక్రవారం నా పెళ్లి జ‌రిగింది. మెస్సీ వస్తున్నాడ‌ని తెలిసి హనీమూన్ ప్లాన్‌ను రద్దు చేసుకున్నాను. మెస్సీ ప‌ర్య‌ట‌నే నాకు ముఖ్యం. నేను 2010 నుంచి అతడిని అనుసరిస్తున్నాన''ని న‌వ‌వ‌ధువు  తెలిపారు. ఆమె భ‌ర్త కూడా మెస్సీ అభిమాని కావ‌డంతో ఇద్ద‌రు అత‌డిని చూడ‌టానికి వ‌చ్చారు. 

''ఈ మ‌ధ్య‌నే మాకు పెళ్లయింది. మెస్సీ ఇండియా పర్యటన కారణంగా హనీమూన్ ర‌ద్దు చేసుకున్నాం. ఎందుకంటే ముందుగా మేము మెస్సీని చూడాలనుకున్నాము. అతడిని చూడటానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ప‌ది పండేన్నేళ్లుగా అత‌డిని ఫాలో అవుతున్నామ‌''ని కొత్త పెళ్లి కొడుకు మీడియాతో త‌న సంతోషాన్ని పంచుకున్నాడు. 

చ‌ద‌వండి: 70 అడుగుల విగ్ర‌హం.. మెస్సీ ఫ‌స్ట్‌ రియాక్ష‌న్ ఇదే!

మెస్సీని చూడటం నా కల
మెస్సీని ద‌గ్గ‌ర నుంచి ప్ర‌త్య‌క్షంగా చూడ‌డం త‌న చిర‌కాల స్వ‌ప్న‌మ‌ని నేపాల్ (Nepal) నుంచి వ‌చ్చిన అభిమాని చెప్పాడు. ''నేను నేపాల్ నుండి వచ్చాను. మెస్సీని చూడటం నా కలల్లో ఒకటి. మా దేశం త‌ర‌పున భారతదేశానికి ధన్యవాదాలు. కేవలం మెస్సీని చూడటానికే టిక్కెట్లు కొన్నాను. నన్ను ఇక్కడికి రావడానికి అనుమతించి, నా కలను నిజం చేసిన నా కుటుంబ సభ్యులకు ధ‌న్య‌వాదాలు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, సోదరుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మెస్సీని చూడటానికి కాలేజీ ఎగ్గొట్టి ఎంతో దూరం నుంచి కోల్‌క‌తాకు వ‌చ్చాను. మెస్సీని చూడటానికి అడ్డుప‌డితే నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాన‌''ని అన్నాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)