Breaking News

T20 WC: ఈసారి ఫైనలిస్టులు ఈ జట్లే: భజ్జీ కామెంట్స్‌ వైరల్‌

Published on Wed, 06/26/2024 - 18:37

పొట్టి క్రికెట్‌ తాజా ప్రపంచకప్‌ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు నాలుగు రోజుల్లో వరల్డ్‌కప్‌-2024 టోర్నీకి తెరపడనుంది. ఇప్పటికే గ్రూప్‌-1 నుంచి టీమిండియా, అఫ్గనిస్తాన్‌.. అదే విధంగా గ్రూప్‌-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తొలి సెమీస్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా- అఫ్గనిస్తాన్‌ ట్రినిడాడ్‌ వేదికగా.. రెండో సెమీ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్‌ గయానా వేదికగా తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం గురువారమే జరుగనున్నాయి.

తొలి మ్యాచ్‌ ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానుండగా.. రిజర్వ్‌ డే కూడా ఉంది. ఇక రెండో సెమీ ఫైనల్‌ రాత్రి ఎనిమిది గంటలకు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్‌ డే లేదు.

కాగా చాలా మంది మాజీ క్రికెటర్లు ఊహించినట్లుగానే ఈసారి టీమిండియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా సెమీస్‌ చేరగా.. అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్‌ కూడా రేసులోకి దూసుకువచ్చింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది.

ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనలిస్టులను అంచనా వేస్తూ.. ‘‘ఈసారి వాళ్లు కూడా ఫైనల్‌కు వస్తారనే అనిపిస్తోంది.

ఏదేమైనా టీమిండియానే ట్రోఫీ గెలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్‌ జట్టును ఉద్దేశించి భజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో భారత్‌తో అఫ్గన్‌ తలపడే అవకాశం ఉందని.. రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌లో గెలుస్తుందని తన అభిప్రాయం వెల్లడించాడు. 

కాగా జూన్‌ 29న వరల్డ్‌కప్‌-2024 ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో గల కెన్సింగ్‌టన్‌ ఓవల్‌ మైదానం ఇందుకు వేదిక.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)