చరిత్ర సృష్టించిన కుల్దీప్‌ యాదవ్‌.. ఆసియాకప్‌ హిస్టరీలోనే

Published on Mon, 09/29/2025 - 12:58

ఆసియాకప్‌-2025లో భాగంగా పాకిస్తాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో టీమిండియా స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. కుల్దీప్ త‌న స్పిన్ మ్యాజిక్‌తో పాక్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. చెల‌రేగి ఆడుతున్న పాక్ బ్యాట‌ర్ల దూకుడుకు క‌ళ్లెం వేశాడు.

కుల్దీప్ యాద‌వ్ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 30 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 4 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో కుల్దీప్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. 

ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా కుల్దీప్ నిలిచాడు. పాక్ బ్యాట‌ర్ సైమ్ అయూబ్‌ను ఔట్ చేసినంత‌రం ఈ రికార్డును కుల్దీప్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు శ్రీలంక బౌలింగ్ దిగ్గ‌జం ల‌సిత్ మ‌లింగ పేరిట ఉండేది.

తాజా మ్యాచ్‌తో మ‌లింగ(33 వికెట్లు) ఆల్‌టైమ్ రికార్డును యాద‌వ్ బ్రేక్ చేశాడు. కుల్దీప్ త‌న ఆసియాక‌ప్‌(వ‌న్డే, టీ20)లో ఇప్ప‌టివ‌రకు 36 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ ఏడాది ఆసియాక‌ప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ మొత్తంగా 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అంతేకాకుండా ఒక ఆసియాక‌ప్ ఏడిష‌న్‌లో అత్య‌ధిక వికెట్లు సాధించిన భార‌త‌ బౌల‌ర్‌గా కూడా కుల్దీప్ రికార్డు స్ప‌ష్టించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ పేరిట ఉంది. ఆసియాక‌ప్‌-2004లో ప‌ఠాన్ 14 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

తాజా ఎడిష‌న్‌లో 17 వికెట్లు సాధించిన కుల్దీప్‌.. ప‌ఠాన్‌ను అధిగ‌మించాడు. కాగా ఫైన‌ల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో భార‌త్ చిత్తు చేసింది. దీంతో రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి ఆసియాక‌ప్‌ను భార‌త్ కైవ‌సం చేసుకుంది.

ఆసియాక‌ప్‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్లు..
కుల్దీప్ యాద‌వ్‌(భార‌త్)-36
ల‌సిత్ మ‌లింగ‌(శ్రీలంక‌)-33
ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక‌)-30
చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడ‌ల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్‌.. బీసీసీఐ సీరియ‌స్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)