చ‌రిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్‌.. పాక్ ఆటగాడి రికార్డు బ్రేక్‌

Published on Mon, 09/15/2025 - 13:36

ఆసియాకప్‌-2025లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో బంతితో మ్యాజిక్ చేసిన కుల్దీప్.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కూడా అదే తీరును కనబరిచాడు.

ఆదివారం దుబాయ్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి పాక్ బ్యాటర్లు ముప్పు తిప్పలు పడ్డారు. ఈ  ఎడమ చేతి వాటం స్పిన్నర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం​ 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఓ అరుదైన ఫీట్‌ను కుల్దీప్ తన పేరిట లిఖించుకున్నాడు.

భారత్‌-పాకిస్తాన్ మధ్య టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు వరకు ఈ ఘనత పాక్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ పేరిట ఉండేది. ఆసియాకప్‌-2022లో భారత్‌పై నవాజ్ 33 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌లో కేవలం  18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన కుల్దీప్‌.. నవాజ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది.  భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా..భిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.

పాక్ బౌలర్లలో అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటిం‍గ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.
చదవండి: ఏడ్చేసిన షోయబ్‌ అక్తర్‌..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)