Breaking News

20 నెల‌లుగా టీమిండియా వ‌ద్దంది.. క‌ట్ చేస్తే! విధ్వంస‌క‌ర సెంచ‌రీ

Published on Thu, 10/16/2025 - 07:42

రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు మెరుగైన రీతిలో మొదలు పెట్టింది. కాన్పూర్ వేదిక‌గా గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆంధ్ర బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 85.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.

వికెట్‌ కీపర్‌ కేెఎస్‌ భరత్‌ (244 బంతుల్లో 142; 13 ఫోర్లు) భారీ శతకంతో చెలరేగాడు. అద్భుత‌మైన బ్యాటింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. భ‌ర‌త్ మ‌రో యువ ఆట‌గాడు షేక్ ర‌షీద్‌తో క‌లిసి మూడో వికెట్‌కు 194 పరుగుల కీలక భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. 

ర‌షీద్ కూడా సెంచ‌రీ దిశ‌గా దూసుకుపోతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే స‌రికి ర‌షీద్ 197 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 94 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓపెన‌ర్‌ అభిషేర్ రెడ్డి(36) ప‌ర్వాలేద‌న్పించ‌గా.. కెప్టెన్ రికీ భుయ్(2) మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. యూపీ బౌలర్లలో ఆఖిబ్‌ ఖాన్‌కు 2 వికెట్లు దక్కగా, విప్‌రాజ్‌ నిగమ్‌ మరో వికెట్‌ తీశాడు.  

గోల్డెన్ ఛాన్స్ మిస్‌..
కేఎస్ భ‌ర‌త్ టీమిండియా త‌ర‌పున 2023లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని ఈ విశాఖ కుర్రాడు సద్వినియోగప‌రుచుకోలేక‌పోయాడు. ఆ త‌ర్వాత రిష‌బ్ పంత్ గాయ ప‌డ‌డంతో గ‌తేడాది స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో కూడా భ‌ర‌త్‌కు ఆడే అవ‌కాశం ల‌భించింది.

కానీ ఈ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ త‌న మార్క్ చూపించ‌లేక‌పోయాడు. దీంతో సెల‌క్ట‌ర్లు అత‌డిని పక్క‌న పెట్టారు. పంత్‌కు ప్ర‌త్న‌మ్నాయంగా మ‌రో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ధ్రువ్ జురెల్‌ను సెల‌క్ట‌ర్లు జ‌ట్టులోకి తీసుకున్నారు. జురెల్ త‌న అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో పంత్‌కే పోటీ ఇస్తున్నాడు. 

కాబ‌ట్టి ఇప్ప‌టిలో భ‌ర‌త్ తిరిగి భార‌త జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. భ‌ర‌త్ చివ‌ర‌గా టీమిండియా త‌ర‌పున గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో ఇంగ్లండ్‌పై ఆడాడు. మొత్తంగా త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 టెస్టులు ఆడిన భ‌ర‌త్‌.. 417 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.
చదవండి: టి20 ప్రపంచకప్‌ టోర్నీకి నేపాల్, ఒమన్‌ అర్హత

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)