Breaking News

వెస్టిండీస్ టీ20 కెప్టెన్‌గా స్టార్ ప్లేయ‌ర్‌.. పావెల్‌పై వేటు

Published on Mon, 03/31/2025 - 22:50

వెస్టిండీస్ క్రికెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వెస్టిండీస్ టెస్టు జ‌ట్టు కెప్టెన్సీకి క్రెయిగ్ బ్రాత్‌వైట్ రాజీనామా చేశాడు. ఈ విష‌యాన్ని విండీస్ క్రికెట్ బోర్డు సోమవారం ధ్రువీక‌రించింది. మార్చి 2021లో జాసన్ హోల్డర్ స్థానంలో వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన బ్రాత్‌వైట్‌.. నాలుగేళ్ల పాటు నాయ‌కుడిగా త‌న సేవ‌ల‌ను అందించాడు.

"ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు  కొత్త కెప్టెన్‌కు అవ‌కాశ‌మిచ్చేందుకు బ్రాత్‌వైత్ త‌న రాజీనామాను సమర్పించాడు. వెస్టిండీస్ క్రికెట్‌కు ఎన్నో అద్బుత‌మైన టెస్టు విజ‌యాల‌ను అందించింనందుకు అత‌డికి  కృతజ్ఞతలు తెలపాల‌నుకుంటున్నాము. కెప్టెన్‌గా అతని సేవలు ఎప్ప‌టికీ మ‌రవ‌లేనివి. వెస్టిండీస్ క్రికెట్ పట్ల అతని అంకితభావాన్ని మాటల్లో వర్ణించ‌లేము" అని విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

బ్రాత్‌వైట్ విండీస్‌కు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాల‌ను అందించాడు. అత‌డి సార‌థ్యంలోనే ఆస్ట్రేలియాలో 27 ఏళ్ల త‌ర్వాత విండీస్ తొలి టెస్టు విజ‌యాన్ని అందుకుంది. అదేవిధంగా బ్రాత్‌వైట్ కెప్టెన్సీలోనే 34 ఏళ్ల త‌ర్వాత పాకిస్తాన్ గ‌డ్డ‌పై టెస్టు సిరీస్‌ను విండీస్ స‌మం చేసింది. మ‌రోవైపు టీ20 జ‌ట్టు కెప్టెన్సీ నుంచి  రోవ్‌మన్ పావెల్‌ను వెస్టిండీస్ క్రికెట్ త‌ప్పించింది. అత‌డి స్ధానంలో వ‌న్డే కెప్టెన్‌గా ఉన్న షాయ్ హోప్‌కు టీ20 పగ్గాల‌ను కూడా విండీస్ క్రికెట్ అప్ప‌గించింది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)