Breaking News

‘చెత్త సెలక్షన్‌.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’

Published on Thu, 08/21/2025 - 13:21

ఆసియా కప్‌-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) వైస్‌ కెప్టెన్సీ, శ్రేయస్‌ అయ్యర్‌కు మొండిచేయి చూపడం గురించి ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.

అదే విధంగా.. యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal), ప్రసిద్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌లను కేవలం స్టాండ్‌ బై ప్లేయర్లుగా ఎంపిక చేయడం.. పేసర్ల విభాగంలో హర్షిత్‌ రాణాకు చోటు దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సుబ్రమణ్యం బద్రీనాథ్‌ హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌లను సెలక్టర్లు పక్కకు పెట్టడాన్ని బద్రీనాథ్‌ తప్పుబట్టాడు. గంభీర్‌ ఆశీసులు ఉండటం వల్లే హర్షిత్‌కు స్థానం దక్కిందని పరోక్షంగా కామెంట్లు చేశాడు.

అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు
ఈ మేరకు.. ‘‘హర్షిత్‌ రాణా అంటే ఎవరికీ బాగా ఇష్టమో అందరికీ తెలుసు. అందుకే అతడికి వరుస అవకాశాలు వస్తున​ఆయి. ఐపీఎల్‌లో చెత్తగా ఆడినా అతడికి చోటిచ్చారు. ప్రసిద్‌ కృష్ణ ఐపీఎల్‌లో, ఇంగ్లండ్‌ సిరీస్‌లో అదరగొట్టినా ప్రధాన జట్టులో అతడికి స్థానమే లేదు.రాణా ఈ జట్టులోకి ఎలా వచ్చాడో నేను అర్థం చేసుకోగలను. కచ్చితంగా ఇదొక చెత్త సెలక్షన్‌. 

సిరాజ్‌, ప్రసిద్‌లు ఏం తప్పు చేశారు?
మహ్మద్‌ సిరాజ్‌ వంటి గొప్ప బౌలర్‌ను కూడా పక్కనపెట్టాడు. ఒకవేళ వర్క్‌లోడ్‌ కారణంగా సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారని అనుకుంటే.. ప్రసిద్‌ కృష్ణ ఉన్నాడు కదా! అయినా సరే హర్షిత్‌ రాణాకే పెద్దపీట వేశారు’’ అని బద్రీనాథ్‌ హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పైకి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.

గంభీర్‌ ప్రోత్సాహం
కాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌గా ఉన్న సమయంలో ఆ జట్టులో ఉన్న హర్షిత్‌ రాణాను గంభీర్‌ ప్రోత్సహించాడు. గంభీర్‌ మార్గనిర్దేశనంలో రాణించిన ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌.. గంభీర్‌ టీమిండియా హెడ్‌కోచ్‌ అయిన తర్వాత ఏకంగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్టు, వన్డే, టీ20లలో అరంగేట్రం చేశాడు. 

అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌లో హర్షిత్‌ కేవలం పదిహేను వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మరోవైపు.. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడిన కర్ణాటక పేసర్‌ ప్రసిద్‌... 25 వికెట్లతో చెలరేగి పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు.

ఆసియా కప్‌ టీ20-2025 టోర్నీకి టీమిండియా
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), హర్షిత్ రాణా, రింకూ సింగ్‌.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌, రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, యశస్వి జైస్వాల్‌.

చదవండి: టీమిండియా వ‌న్డే కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌?

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)