Breaking News

ఇంగ్లండ్‌కు టీమిండియా స‌వాల్‌ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది?

Published on Sun, 07/27/2025 - 08:09

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్టు ఆస‌క్తిక‌రంగా మారింది. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఖాతా తెరవ‌కుండానే రెండు వికెట్లు కోల్పోయి భార‌త్‌  క‌ష్టాల్లో ప‌డింది.

ఈ స‌మ‌యంలో జ‌ట్టును కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌(167 బంతుల్లో 78 బ్యాటింగ్‌), కేఎల్‌ రాహుల్‌ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు),  విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌల‌ర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడపించారు. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ రెండు వికెట్లు న‌ష్టానికి 174 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం గిల్ సేన 137 పరుగులు వెనుకంజలో ఉంది.

టీమిండియా సవాల్ విసురుతుందా?
కాగా మాంచెస్టర్ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలూండడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందా? లేదా డ్రా ముగిస్తుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆఖరి రోజు ఆటలో తొలి సెషన్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.

ఇంగ్లండ్‌కు టార్గెట్ నిర్దేశించాలని భారత జట్టు భావిస్తే కచ్చితంగా మొదటి సెషన్‌లో వికెట్లు ఏమీ కోల్పోకుండా కాస్త దూకుడుగా ఆడాలి.  ఇంగ్లండ్‌కు 200 పైగా టార్గెట్ ఇవ్వాలన్న టీమిండియా ఖచ్చితంగా టీ బ్రేక్ వరకు అయినా బ్యాటింగ్ చేయాలి. అంటే వన్డే తరహాలో తమ బ్యాటింగ్‌ను కొనసాగించాలి.

ఒకవేళ తొలి సెషన్‌లో టీమిండియా వికెట్లు కోల్పోతే డ్రా కోసం వెళ్తే బెటర్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గాయపడిన రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చినా, క్రీజులో నిలదొక్కకుంటాడో లేదా అన్నది ప్రశ్నార్ధంగా మారింది.

అతడు కాలి పాదం గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. పంత్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లకు వెళ్లే అవకాశముంది. ఆ ప్రయత్నంతో పంత్ వికెట్ కోల్పోయిన ఆశ్చర్యపోన్కర్లలేదు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ప్రతిఘటించే అవకాశమున్నప్పటికి, వాషింగ్టన్ సుందర్‌, శార్ధూల్ ఠాకూర్ ఎప్పుడూ ఎలా ఆడుతారో చెప్పలేం. 

కాబట్టి టీమిండియా మొత్తం ఆశలన్నీ క్రీజులో ఉన్న శుబ్‌మన్ గిల్‌, రాహుల్‌పైనే ఉన్నాయి. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ వీలైనంత త్వరగా భారత్‌ను ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.
చదవండి: కివీస్‌దే ముక్కోణపు టోర్నీ

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?