Breaking News

టీమిండియాకు మరో భారీ షాక్‌​

Published on Mon, 02/12/2024 - 18:34

ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ మిడిలార్డర్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో విఫలమయ్యాడని సమాచారం. దీంతో రాహుల్‌  మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. మరోవైపు రాహుల్‌తో పాటు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేశాడని సమాచారం.

రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా అతని కర్ణాటక సహచరుడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో పడిక్కల్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతను ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 92.67 సగటున 3 సెంచరీల సాయంతో 556 పరుగులు చేశాడు. 

ఇప్పటికే వివిధ కారణాల చేత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, మొహమ్మద్‌ షమీ సేవలు కోల్పోయిన టీమిండియాకు రాహుల్‌ గైర్హాజరీ మరింత ఇ‍బ్బందికరంగా పరిగణించబడుతుంది. తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన రాహుల్‌ రెండో టెస్ట్‌ కూడా ఆడలేదు. వారం తర్వాత రాహుల్‌కు మరోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తారని సమాచారం.

సీనియర్లంతా ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతుండటంతో టీమిండియా అభిమానులు కలవరపడుతున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌, భారత్‌ చెరో మ్యాచ్‌ గెలిచి సమంగా ఉన్నారు. మూడో టెస్ట్‌ రాజ్‌కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది. 

ఇదిలా ఉంటే,ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు భారత జట్టును రెండ్రోజుల కింద ప్రకటించారు. జట్టును ప్రకటించే సమయంలోనే ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేయాల్సి ఉంటుందని సెలెక్టర్లు చెప్పారు. గాయాల కారణంగా రెండో టెస్ట్‌కు దూరమైన రాహుల్‌, జడేజాను దృష్టిలో ఉంచుకునే సెలెక్టర్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)