Breaking News

మయాంక్‌ కెప్టెన్సీలో ఆడనున్న కేఎల్‌ రాహుల్‌

Published on Thu, 12/18/2025 - 12:52

విజయ్ హజారే ట్రోఫీ 2025–26 సీజన్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కర్ణాటక క్రికెట్ అసోసియేషిన్‌ ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్‌, ప్రసిద్ద్ కృష్ణలు ఉన్నారు. దీంతో కర్ణాటక జట్టు మరింత పటిష్టంగా మారింది.

బీసీసీఐ అదేశాలతో వీరిద్దరూ దేశవాళీ వన్డే టోర్నీ బరిలోకి దిగనున్నారు. ఇక ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా కరుణ్ నాయర్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా అండర్-23 టోర్నీలో కర్ణాటక తరపున అదరగొట్టిన హర్షిల్ ధర్మాని, ధ్రువ్ ప్రభాకర్లకు సీనియర్ జట్టులో చోటు లభించింది.

ఈ టోర్నీలో ధర్మాని తమిళనాడుపై 142 పరుగులు, ప్రభాకర్ విదర్భపై 126 పరుగులతో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా శ్రీష ఆచార్ చోటు దక్కించుకున్నాడు. కర్ణాటక తమ గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లో ఆడనుంది.

ఈ టోర్నీలో కర్ణాటక​ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. కర్ణాటక టీమ్ తొలి మ్యాచ్‌లో డిసెంబర్ 24న జార్ఖండ్‌తో తలపడనుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల సైతం ఈ టోర్నీలో ఆడనున్నారు.

విజయ్ హజారే ట్రోఫీ 2025-26 కోసం కర్ణాటక జట్టు: 
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్ (వైస్ కెప్టెన్‌), స్మరణ్,  శ్రీజిత్, అభినవ్ మనోహర్, శ్రేయాస్ గోపాల్,వ్యాషాక్, మన్వంత్ కుమార్ , శ్రీషా S ఆచార్, అభిలాష్ శెట్టి, శరత్ , హర్షిల్ ధర్మాని, కేఎల్ రాహుల్‌, ప్రభాకర్ 
చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వ‌ర‌కు..
 

 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)