తుదిజట్టులో అతడు తప్పక ఉంటాడు: కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌

Published on Sat, 11/29/2025 - 15:27

టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ వన్డే మ్యాచ్‌ ఆడి ఏడాది దాటిపోయింది. గతేడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో చివరగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వన్డే బరిలో దిగాడు. టెస్టుల్లో రెగ్యులర్‌ ఆటగాడిగా బిజీ అయిన రిషభ్‌ పంత్‌.. చాన్నాళ్లుగా వన్డే ఫార్మాట్‌కు దూరమయ్యాడు.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ పంత్‌ (Rishabh Pant)కు స్థానం దక్కలేదు. అయితే, తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు మాత్రం సెలక్టర్లు పంత్‌ను ఎంపిక చేశారు. శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) గైర్హాజరీలో అతడికే కెప్టెన్‌ చేస్తారని కూడా భావించగా.. సీనియర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపింది.

వికెట్‌ కీపర్‌గా పంత్‌ను ఆడిస్తారా? 
ఇక రాహుల్‌ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ రాంచీ వేదికగా మొదలుపెట్టనుంది. ప్రొటిస్‌ జట్టుతో ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌ తుదిజట్టు కూర్పు, పంత్‌ స్థానం గురించి చర్చ నడుస్తుండగా.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సౌతాఫ్రికాతో తొలి వన్డేకు ముందు శనివారం మీడియాతో మాట్లాడిన రాహుల్‌కు.. పంత్‌ గురించి ప్రశ్న ఎదురైంది. వికెట్‌ కీపర్‌గా పంత్‌ను ఆడిస్తారా? లేదంటే మీరే కీపర్‌గానూ వ్యవహరిస్తారా? అని విలేకరులు రాహుల్‌ను అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘రిషభ్‌ స్పెషలిస్టు బ్యాటర్‌గా ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

తుదిజట్టులో తప్పక ఉంటాడు
తుదిజట్టులో అతడు తప్పక ఉంటాడు. అయితే, వికెట్‌ కీపర్‌గా తను ఉంటాడా? లేదా? నేనే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తానా అనేది రేపే (ఆదివారం) తెలుస్తుంది’’ అని రాహుల్‌ పేర్కొన్నాడు. మొత్తానికి తుదిజట్టులో పంత్‌కు చోటు ఉందని చెప్పి.. అతడి వన్డే రీఎంట్రీని రాహుల్‌ ధ్రువీకరించాడు.

కాగా రెండేళ్లుగా కేఎల్‌ రాహుల్‌ వన్డేల్లో టీమిండియా వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సౌతాఫ్రికాతో సిరీస్‌లో కెప్టెన్సీ చేస్తున్నందున కీపర్‌గా అదనపు భారాన్ని అతడు పక్కనపెట్టే అవకాశం ఉంది.

ఇక నవంబరు 29- డిసెంబరు 6 వరకు భారత్‌- సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ప్రొటిస్‌ జట్టు చేతిలో టెస్టుల్లో టీమిండియా 2-0తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో పంత్‌ సహా కీలక బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

సౌతాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు
రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్‌ గైక్వాడ్‌, ప్రసిద్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)