Breaking News

ఫిన్‌ అలెన్‌ విధ్వంసకర శతకం.. జోష్‌లో కేకేఆర్‌ ఫ్యాన్స్‌

Published on Fri, 01/16/2026 - 11:50

బిగ్‌బాష్‌ లీగ్‌ 2025-26లో పెర్త్‌ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కేకేఆర్‌ ఆటగాడు ఫిన్‌ అలెన్‌ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 

ఫలితంగా స్కార్చర్స్‌ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో అలెన్‌కు ఇది ఐదో శతకం. బీబీఎల్‌లో మొదటిది. ఈ సెంచరీ స్కార్చర్స్‌ అభిమానులతో పాటు కేకేఆర్‌ ఫ్యాన్స్‌లోనూ జోష్‌ నింపింది. అలెన్‌కు కేకేఆర్‌ 2026 సీజన్‌ వేలంలో రూ. 2 కోట్లకు దక్కించుకుంది.  

రెనెగేడ్స్‌తో మ్యాచ్‌లో తొలుత నిదానంగా ఆడిన అలెన్‌.. హాఫ్‌ సెంచరీ తర్వాత గేర్‌ మార్చాడు. కేవలం​ 17 బంతుల్లోనే రెండో అర్ద సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. గురిందర్‌ సంధు వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో అలెన్‌ వరుసగా మూడు సిక్సర్లు బాదడం​ మ్యాచ్‌ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అలెన్‌ ఊచకోత కోయడంతో స్కార్చర్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కార్చర్స్‌.. అలెన్‌ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

స్కార్చర్స్‌ ఇన్నింగ్స్‌లో అలెన్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మిచెల్‌ మార్ష్‌ 20, కూపర్‌ కన్నోలీ 18, ఆరోన్‌ హార్డీ 22, ఆస్టన్‌ టర్నర్‌ 13, లారీ ఈవాన్స్‌ 21, నిక్‌ హాబ్సన్‌ 3 పరుగులకు ఔటయ్యారు. రెనెగేడ్స్‌ బౌలర్లలో సామ్‌ ఇలియట్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్‌ తడబడింది. టిమ్‌ సీఫర్ట్‌ (66), జేక్‌ ఫ్రేజర్‌ (42) మాత్రమే రాణించారు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా ఔటైపోయారు. స్కార్చర్స్‌ బౌలర్లు కన్నోలీ, బియర్డ్‌మన్‌ తలో 2, లూక్‌ హాల్ట్‌, ఆరోన్‌ హార్డీ చెరో వికెట్‌ తీసి రెనెగేడ్స్‌ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. వీరి ధాటికి రెనెగేడ్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)