Breaking News

శెభాష్‌ రియాన్‌!.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు.. కానీ పాపం..

Published on Sun, 05/04/2025 - 19:17

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ (KKR vs RR) కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (Riyan Parag) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభంలోనే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ తానున్నానంటూ బ్యాట్‌ ఝులిపించాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఏకాగ్రత చెదరనీయకుండా నిలకడగా ఆడిన రియాన్‌ పరాగ్‌.. 27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చేశాడు. అప్పటికి రాజస్తాన్‌ ఇన్నింగ్‌స్లో 12 ఓవర్లు ముగియగా స్కోరు 102-5గా ఉంది.

పూనకం వచ్చినట్లుగా 
ఆ మరుసటి ఓవర్లో రియాన్‌ పరాగ్‌ పూనకం వచ్చినట్లుగా బ్యాట్‌తో బంతిని బాదేశాడు. పదమూడో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన కేకేఆర్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీకి చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో తొలి బంతిని షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (29) ఎదుర్కొని సింగిల్‌ తీశాడు.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్‌ ఆ తర్వాతి ఐదు బంతుల్లో వరుసగా సిక్సర్లు బాదాడు. ఇందుకు తోడు ఈ ఓవర్లో మొయిన్‌ అలీ ఓ వైడ్‌ కూడా వేశాడు. ఫలితంగా పదమూడో ఓవర్లో రాజస్తాన్‌కు ఏకంగా 32 పరుగులు వచ్చాయి. రియాన్‌ పరాగ్‌ స్కోరు 75 పరుగులకు చేరింది.

సెంచరీకి ఐదు పరుగుల దూరంలో 
కాగా ఇలా ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం ద్వారా రియాన్‌ పరాగ్‌ చరిత్రకెక్కాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన రియాన్‌ పరాగ్‌ దురదృష్టవశాత్తూ.. సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

పద్దెనిమిదవ ఓవర్లో హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో నాలుగో బంతికి షాట్‌ ఆడేందుకు బాల్‌ను గాల్లోకి లేపగా.. లాంగాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న వైభవ్‌ అరోరా క్యాచ్‌ పట్టాడు. దీంతో రియాన్‌ పరాగ్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న అతడు ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక ఈ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఐపీఎల్‌-2025లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌- రాజస్తాన్‌ ఆదివారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఒక్క పరుగు తేడాతో కేకేఆర్‌ చేతిలో ఓటమిపాలైంది.

ఐపీఎల్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే
👉క్రిస్‌ గేల్‌ 2012లో రాహుల్‌ శర్మ బౌలింగ్‌లో
👉రాహుల్‌ తెవాటియా 2020లో కాటెరెల్‌ బౌలింగ్‌లో
👉రవీంద్ర జడేజా 2021లో హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో
👉రింకూ సింగ్‌ 2023లో యశ్‌ దయాళ్‌ బౌలింగ్‌లో
👉రియాన్‌ పరాగ్‌ 2025లో మొయిన్‌ అలీ బౌలింగ్‌లో..

ఐపీఎల్‌ 2025: కోల్‌కతా వర్సెస్‌ రాజస్తాన్‌
👉కోల్‌కతా స్కోరు: 206/4 (20)
👉రాజస్తాన్‌ స్కోరు: 205/8 (20)

చదవండి: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు.. హృదయం ముక్కలైంది!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)