విమానం దారి మళ్లింపు... వారణాసిలో కోల్‌కతా జట్టు

Published on Wed, 05/08/2024 - 06:58

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లకు సోమవారం రాత్రి కునుకు లేకుండా గడిచింది. క్రికెటర్లు ప్రయాణించిన విమానం లక్నో నుంచి కోల్‌కతాకు బయలుదేరాల్సి ఉండగా... ప్రతికూల వాతావరణంతో పలుమార్లు దారి మళ్లించారు. వారి చార్టర్‌ ఫ్లయిట్‌ను తొలుత గువాహటికి మళ్లించారు. అక్కడి నుంచి కోల్‌కతాకు క్లియరెన్స్‌ రావడంతో టేకాఫ్‌ అయిన విమానానికి మళ్లీ వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు.

 దీంతో ఉన్నపళంగా ఫ్లయిట్‌ను వారణాసి ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించాల్సి వచి్చంది. అలా తీవ్రమైన ప్రయాణ బడలిక, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఆటగాళ్లు సోమవారమంతా వారణాసిలోని హోటల్‌లో గడపాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత తమ విమాన ప్రయాణం ఉండటంతో ఈలోపు కోల్‌కతా జట్టు క్రికెటర్లు వారణాసిలో కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం తర్వాత నైట్‌రైడర్స్‌ జట్టు కోల్‌కతాకు చేరుకోగలిగింది. ఈ నెల 11న సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ తదుపరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది.   

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)