Breaking News

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా యాజ్ఞిక్‌

Published on Thu, 01/22/2026 - 09:34

కోల్‌కతా: వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దిశాంత్‌ యాజ్ఞిక్‌ను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. దేశవాళీలతో పాటు... ఐపీఎల్‌ అనుభవం ఉన్న ఈ రాజస్తాన్‌ ప్లేయర్‌ రాకతో తమ శిక్షణ బృందం బలం మరింత పెరుగుతుందని కేకేఆర్‌ యాజమాన్యం భావిస్తోంది. 

‘యాజ్ఞిక్‌కు అపార అనుభవం ఉంది. అది జట్టుకు ఉపకరించనుంది. ఈసారి ఐపీఎల్‌కు కొత్త సపోర్టింగ్‌ స్టాఫ్‌తో బరిలోకి దిగనున్నాం. హెడ్‌ కోచ్‌గా అభిషేక్‌ నాయర్, మెంటార్‌గా డ్వేన్‌ బ్రావో, అసిస్టెంట్‌ కోచ్‌గా షేన్‌ వాట్సన్, బౌలింగ్‌ కోచ్‌గా టిమ్‌ సౌతీ, పవర్‌ కోచ్‌గా ఆండ్రీ రసెల్‌ వ్యవరిస్తున్నారు. 

ఇప్పుడు ఆ జాబితాలో యాజ్ఞిక్‌ చేరుతున్నాడు. అతడి కోచింగ్‌ జర్నీలో ఇది ప్రత్యేకంగా నిలవడం ఖాయం’ అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీల్లో రాజస్తాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యాజ్ఞిక్‌... 2011 నుంచి 2014 మధ్య 25 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం వివిధ జట్లకు శిక్షణనిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది.    

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)