Breaking News

కేకేఆర్‌ జట్టులోకి షేన్ వాట్స‌న్‌..

Published on Thu, 11/13/2025 - 15:32

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు  'అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండ‌ర్ షేన్‌ వాట్సన్‌ను కేకేఆర్ నియ‌మించింది.   కోల్‌క‌తా హెడ్ కోచ్ అభిషేక్ నాయ‌ర్‌తో క‌లిసి వాట్స‌న్ ప‌నిచేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీక‌రించాడు.

షేన్ వాట్స‌న్‌ను కేకేఆర్ కుటంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆట‌గాడిగా,  కోచ్‌గా అత‌డి అనుభ‌వం మా జ‌ట్టు సన్న‌ద్ద‌తకు ఉప‌యోగ‌ప‌డుతోంది. టీ20 ఫార్మాట్‌పై అత‌డి అవ‌గ‌హ‌న మా జ‌ట్టును మ‌రో స్ధాయి తీసుకువెళ్తుంద‌ని ఆశిస్తున్నాము అని వెంకీ మైసూర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ట్రాక్ రికార్డు అదుర్స్‌
కాగా ఐపీఎల్‌లో షేన్ వాట్స‌న్ ఆట‌గాడిగా, కోచ్‌గా త‌న సేవ‌ల‌ను అందించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన వాట్స‌న్‌.. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. 2013 సీజ‌న్‌లో కూడా మ‌రోసారి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ద‌క్కించుకున్నాడు. ఐపీఎల్‌-2018 సీజ‌న్‌లో సీఎస్‌కే ఛాంపియ‌న్‌గా నిల‌వ‌డంలో వాట్స‌న్‌ది కీల‌క పాత్ర‌. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత‌మైన సెంచ‌రీతో షేన్ చెల‌రేగాడు. 

ఇక‌ఐపీఎల్ రిటైర్మెంట్ త‌ర్వాత ఢిల్లీ క్యాపిట‌ల్స్  అసిస్టెంట్ కోచ్‌గా కూడా వాట్సన్ పనిచేశాడు. ఇప్పుడు తొలిసారి కేకేఆర్ కోచింగ్ స్టాప్‌లో ఈ ఆసీస్ దిగ్గజం భాగంకానున్నాడు. ఇక కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక కావ‌డం పట్ల షేన్ వాట్స‌న్ ఆనందం వ్య‌క్తం చేశాడు. 

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ వంటి అద్భుత ఫ్రాంచైజీలో భాగం కావ‌డం నాకు ద‌క్కిన గొప్ప గౌరవం.  కోల్‌కతాకు మరో టైటిల్‌ను అందించ‌డానికి అన్ని విధాల‌గా కృషి చేస్తానని వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌-2024 ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్‌.. గత సీజన్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో హెడ్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌పై కేకేఆర్‌ వేటు వేసింది.
చదవండి: నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడనున్న మరో భారత స్టార్‌ క్రికెటర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)