Breaking News

పాక్‌తో రెండో వన్డే.. సూపర్‌ సెంచరీతో విరుచుకుపడిన కివీస్‌ ఓపెనర్‌

Published on Wed, 01/11/2023 - 19:54

PAK VS NZ 2nd ODI: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే సూపర్‌ సెంచరీతో (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్‌) విరుచుకుపడ్డాడు. అతనికి కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) తోడవ్వడంతో న్యూజిలాండ్‌ 261 పరుగులు చేసి ఆలౌటైంది (49.5 ఓవర్లలో). వీరిద్దరూ రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 181 పరుగులు జోడించడంతో ఓ దశలో పర్యాటక జట్టు భారీ స్కోర్‌ సాధిస్తుందని అం‍తా భావించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్‌ కావడం, సాంట్నర్‌ (37) మినహా జట్టులో మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో న్యూజిలాండ్‌ నామమాత్రపు స్కోర్‌కే ఆలౌటైంది.

పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ నవాజ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. నసీం షా 3, హరీస్‌ రౌఫ్‌, ఉసామా మిర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ డ్రాగా  ముగిసింది. రెండు మ్యాచ్‌ల్లో పాక్‌ ఓటమి అంచుల దాకా వచ్చి డ్రాతో గట్టెక్కింది. అంతకుముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను పాక్‌ 0-3 తేడాతో కోల్పోయింది.   

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)