Breaking News

చెలరేగిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా స్కోరెంతంటే?

Published on Mon, 01/05/2026 - 17:35

బెనోని వేదికగా దక్షిణాఫ్రికా అండర్‌-19తో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. భారత యువ పేసర్‌ కిషన్‌ కుమార్‌ సింగ్‌ 4 వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించాడు.

అతడితో పాటు ఆర్‌ ఆర్ఎస్ అంబరీష్ రెండు, కన్షిక్‌, దీపేష్‌ తలా వికెట్‌ సాధించారు. ప్రోటీస్‌ బ్యాటర్లలో జేసన్ రౌల్స్ (Jason Rowles) ఒక్కడో విరోచిత పోరాటం కనబరిచాడు. సహచరులు ఘోరంగా విఫలమైనా రౌల్స్‌ మాత్రం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు.

దూకుడుగా ఆడుతున్న వైభవ్‌..
అనంతరం లక్ష్య చేధనలో భారత్‌ దూకుడుగా ఆడుతోంది. ముఖ్యంగా కెప్టెన్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రత్యర్ధి బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 8 సిక్స్‌ల సాయంతో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. వైస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ జార్జ్‌ 20 పరుగులు చేసి ఔటయ్యాడు.

క్రీజులో సూర్యవంశీ, వేదాంత్‌ త్రివేది ఉన్నారు. కాగా ఇప్పటికే తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి కూడా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని యంగ్‌ టీమిండియా పట్టుదలతో ఉంది.
చదవండి: 129 ఫోర్లు, 59 సిక్సర్లు.. 1009 రన్స్‌ బాదిన ఆ ‘కుర్రాడు’ ఎక్కడ?

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)