Breaking News

సెలెక్ట్‌ చేస్తారని అనుకున్నా.. కరుణ్‌ నాయర్‌ ఆవేదన

Published on Fri, 09/26/2025 - 17:45

త్వరలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ (India vs West Indies) కోసం భారత జట్టును (Team India) నిన్న (సెప్టెంబర్‌ 25) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించిన విధంగానే ఇంగ్లండ్‌ పర్యటనలో నిరాశపరిచిన కరుణ్‌ నాయర్‌కు (karun Nair) చోటు దక్కలేదు. కరుణ్‌పై వేటు అంశం నిన్నటి నుంచి భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా ఉంది.

చాలామంది కరుణ్‌ను తప్పించడం సమంజసమే అని అంటుంటే.. కొందరు మాత్రం అతనికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కరుణ్‌ స్వయంగా స్పందించాడు. ఓ ప్రముఖ వార్త సంస్థతో మాట్లాడుతూ.. 

"సెలెక్ట్‌ చేస్తారని అనుకున్నా. కానీ చేయలేదు. దీని గురించి ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు. చివరి టెస్ట్‌లో ఫిఫ్టీ చేశాను. ఆ ఇన్నింగ్స్‌లో మరెవ్వరూ ఈ మార్కును తాకలేకపోయారు. ఆ మ్యాచ్‌లో (ఓవల్‌ టెస్ట్‌) టీమిండియా గెలిచింది. అయినా ఇవన్నీ సెలెక్టర్లకు పట్టవంటూ" అవేదనకు లోనయ్యాడు.

ఇదే అంశంపై చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగర్కార్‌ కూడా స్పందించాడు. అతని వాదన వేరేలా ఉంది. కరుణ్‌ నుంచి చాలా ఆశించినట్లు చెప్పుకొచ్చాడు. కరుణ్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్న దేవ్‌దత్‌ పడిక్కల్ (Devdutt Padikkal) చాలా ఆప్షన్స్ ఇస్తాడని అన్నాడు.

కరుణ్‌ మంచి ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం టీమ్ ట్రాన్సిషన్‌లో ఉంది. ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని పడిక్కల్‌ను ఎంపిక చేశాం. ప్రతి ఆటగాడికి 15-20 అవకాశాలు ఇవ్వాలనుకుంటాం. కానీ, అది ఎప్పుడూ సాధ్యపడదని పేర్కొన్నాడు.

కాగా, ఇంగ్లండ్‌పై ట్రిపుల్‌ సెంచరీతో రాత్రికిరాత్రి హీరో అయిపోయి, అతి కొద్ది కాలంలోనే ఫామ్‌ కోల్పోయి కనుమరుగైన కరుణ్‌ నాయర్‌.. ఆతర్వాత ఏళ్ల తరబడి దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటి ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు కూడా అతను భారత జట్టులో ఎంతో కాలం నిలువలేకపోయాడు. కేవలం​ 8 ఇన్నింగ్స్‌ల్లోనే అతని ఖేల్‌ ఖతమైంది.

ఇంగ్లండ్‌ పర్యటనలో కరుణ్‌  8 ఇన్నింగ్స్‌ల్లో 25.62 సగటున కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ సాయంతో 205 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో కరుణ్‌కు మంచి ఆరంభాలు లభించినా, వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు అతన్ని విండీస్‌ సిరీస్‌కు ఎంపిక చేయలేదు.

చదవండి: వైభవ్‌ విఫలమైనా..! ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)