Breaking News

నేపాల్ పేసర్ చారిత్రక ఘనత

Published on Mon, 07/27/2026 - 18:52

నేపాల్ పేస్‌ బౌలర్‌ కరణ్ కేసీ వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి నేపాల్ పేసర్‌గా, సందీప్ లామిచ్ఛానే తర్వాత రెండో నేపాల్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లీగ్-2లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరణ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కరణ్‌ 10 ఓవర్లలో కేవలం​ 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెండో వికెట్‌తో అతను 100 వికెట్ల మైలురాయిని తాకాడు.

2018లో నెదర్లాండ్స్‌పై వన్డే అరంగేట్రం చేసిన కరణ్‌.. 72 ఇన్నింగ్స్‌ల్లో 103 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌ సామర్థ్యం కూడా కలిగిన కరణ్‌, ఈ ఫార్మాట్‌లో ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 700 పరుగులు కూడా చేశాడు. 34 ఏళ్ల కరణ్‌ టీ20 ఫార్మాట్లోనూ సత్తా చాటుతే 112 వికెట్లు తీశాడు.

నమీబియా-నేపాల్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జాన్‌ ఫ్రైలింక్‌ (100) సెంచరీతో సత్తా చాటగా.. స్టీన్‌క్యాంప్‌ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా.. నమీబియా భారీ స్కోర్‌ సాధించేలా కనిపించింది. అయితే కరణ్‌ (10-2-29-5) అద్భుత స్పెల్‌తో వారి ఆశలు అడియాశలు చేశాడు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)