Breaking News

'రూమ్‌లో కూర్చుంటే కుద‌ర‌దు'. భారత ప్లేయర్లపై కపిల్‌దేవ్‌ ఫైర్‌

Published on Fri, 11/08/2024 - 11:24

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో టీమిండియా వైట్‌వాష్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌లో భార‌త బ్యాట‌ర్లు దారుణమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. కివీస్ స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కొవ‌డంలో టీమిండియా ఆట‌గాళ్లు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లి,  రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు సైతం కివీస్ బౌలర్ల ముందు తేలిపోయారు.

ఫలితంగా స్వదేశంలో తొలిసారి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ అయ్యి ఘోర ఆప్రతిష్టతను భారత జట్టు మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రోహిత్‌ సేనకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు మెరుగుపడడానికి నిరంతరం ప్రాక్టీస్ చేయడం ఒక్కటే మార్గమని కపిల్‌​ దేవ్‌  అభిప్రాయపడ్డాడు.

రూమ్‌లో కూర్చుంటే కుదరదు..
"క్రికెట్ బేసిక్స్‌కి తిరిగి వెళ్లండి. ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టండి. అంతే తప్ప రూమ్‌లో కూర్చుని మెరుగ‌వుతామంటే కుదరదు. ప్రస్తుతం మీకు గడ్డుకాలం నడుస్తోంది. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచిది" అని క్రికెట్ నెక్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు.

కాగా కివీస్ టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమవుతోంది. వచ్చే వారం ఆస్ట్రేలియాకు రోహిత్ సేన పయనం కానుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు
రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, యశస్వి జైశ్వాల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, ఆకాశ్‌ దీప్‌, మహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, హర్షిత్‌ రాణా, నితీశ్‌కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌.
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌..

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి