Breaking News

రిచర్డ్స్‌, సచిన్‌, కోహ్లి, రోహిత్‌! కానీ ఇలాంటి బ్యాటర్‌ శతాబ్దానికొక్కడే!

Published on Mon, 01/09/2023 - 16:32

India vs Sri Lanka-  Suryakumar Yadav: ‘‘అతడి ఇన్నింగ్స్‌ గురించి వర్ణించడానికి నాకు మాటలు చాలడం లేదు. సచిన్‌ టెండుల్కర్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి... ఈ జాబితాలో తన పేరు కూడా ఉంటుందనే ఆలోచన ఎప్పుడో కలిగించాడు. భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదువ లేదు.

అందులోనూ ఇలాంటి ప్లేయర్లు సూపర్‌. తన ఆట అత్యద్భుతం. ముఖ్యంగా ఫైన్‌ లెగ్‌ దిశగా తను కొట్టే ల్యాప్‌ షాట్‌ అమోఘం. తను అలా ఆడుతుంటే బౌలర్లు బెంబేలెత్తిపోతారు. తను ఎటూ కదలకుండానే మిడాన్‌, మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌ బాదగలడని వాళ్లకు తెలుసు. 

షాట్‌ సెలక్షన్‌ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. డివిలియర్స్‌, వివియన్‌ రిచర్డ్స్‌, సచిన్‌, విరాట్‌, రిక్కీ పాంటింగ్‌.. లాంటి ఎంతో మంది బ్యాటింగ్‌ దిగ్గజాలను చూశాను. కానీ.. అతడిలా బంతిని ఇంత క్లీన్‌గా హిట్‌ చేయగల బ్యాటర్‌ను చూడలేదు. హ్యాట్సాఫ్‌’’ అంటూ టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆకాశానికెత్తాడు.


సూర్యకుమార్‌ యాదవ్‌

ఆకాశమే హద్దుగా ‘స్కై’
కాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సూర్య విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న ‘స్కై’.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 112 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించి.. సిరీస్‌ గెలవడంలో సహాయపడ్డాడు.


కపిల్‌ దేవ్‌- స్కై

శతాబ్దానికి ఒక్కడు
ఈ నేపథ్యంలో.. కపిల్‌ దేవ్‌.. సూర్య ది గ్రేట్‌ ఇన్నింగ్స్‌ గురించి ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘హ్యాట్సాఫ్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. తనలాంటి ఆటగాళ్లు శతాబ్దానికి ఒక్కరే ఉంటారు’’ అంటూ కొనియాడాడు. కాగా లంకతో మ్యాచ్‌లో సెంచరీ సూర్య కెరీర్‌లో మూడోది. మిగతా రెండూ కూడా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లలో సాధించినవే!! ఈ శతకంతో సూర్య పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

చదవండి: Zimbabwe Cricket: జింబాబ్వే క్రికెట్‌లో తీవ్ర విషాదం.. రోజుల వ్యవధిలోనే దంపతుల హఠాన్మరణం
Virat Kohli: అదొక జబ్బు! దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్‌ వైరల్‌

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)