Breaking News

సంజూను సూర్యతో పోల్చకండి.. ఎందుకంటే: టీమిండియా దిగ్గజం

Published on Fri, 03/24/2023 - 17:03

Suryakumar Yadav- Sanju Samson: ‘‘ఎవరైతే మెరుగైన ప్రదర్శన కనబరుస్తారో వాళ్లకు తప్పకుండా వరుస అవకాశాలు లభిస్తాయి. సూర్యతో సంజూ శాంసన్‌ను పోల్చకండి. ప్రస్తుతం ఇలాంటి పోలికలు సరికాదు. ఒకవేళ సంజూకి సూర్య లాంటి పరిస్థితే ఎదురైతే మనం వేరొకరి గురించి మాట్లాడే వాళ్లం కదా!’’ అని టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ అన్నాడు.

ఎవరికి ఎప్పుడు అవకాశాలు ఇవ్వాలనేది పూర్తిగా మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.

మూడు వన్డేల్లోనూ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగి చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. తీవ్ర విమర్శల పాలయ్యాడు. వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్‌ వంటి ఆటగాళ్లను కాదని సూర్యకు అవకాశం ఇస్తే.. మరీ ఘోరంగా విఫలమయ్యాడంటూ అభిమానులు దుమ్మెత్తిపోశారు. 

ఈ నేపథ్యంలో కపిల్‌ దేవ్‌ స్పందిస్తూ.. ‘‘టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు మద్దతుగా నిలవాలని భావిస్తే అతడికే వరుస అవకాశాలు ఇస్తుంది. బయట జనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ, జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యానిదే అంతిమ నిర్ణయం. కాబట్టి ఇలాంటి పోలికలు వద్దు’’ అని ఏబీపీ న్యూస్‌తో వ్యాఖ్యానించాడు. 

ఇదేమీ కొత్తకాదు
అదే విధంగా సూర్య బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుతూ..‘‘మ్యాచ్‌ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆఖరి వన్డేలో ఫినిషర్‌ పాత్ర పోషిస్తాడనే భావనతో సూర్యకుమార్‌ను ఏడో స్థానంలో పంపినట్లు అనిపిస్తోంది. వన్డేల్లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేయడం సర్వసాధారణమే. 

ఇంతకుముందు కూడా టీమిండియా ఎన్నోసార్లు ఇలాంటి ప్రయోగాలు చేసింది. అయితే, కొన్నిసార్లు టాపార్డర్‌ బ్యాటర్‌ను డౌన్‌ ఆర్డర్‌లో పంపితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏదేమైనా జట్టుకు సంబంధించిన ప్రతి విషయంలో కోచ్‌, కెప్టెన్‌ ప్రధాన పోషిస్తారు కదా! ఎవరైనా ఆటగాడు తనకు బ్యాటింగ్‌ పొజిషన్‌లో ఇబ్బంది ఉందని చెబితే.. వాళ్లు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కపిల్‌ దేవ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా తొలి రెండు వన్డేల్లో తన రెగ్యులర్‌ పొజిషన్‌ అయిన నాలుగో స్థానంలో వచ్చిన సూర్య మూడో వన్డేలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే భారత్‌ వేదికగా జరిగిన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023ని టీమిండియా కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్‌ సొంతం చేసుకుంది.

చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు దూరమైనా పంత్‌కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం!
Kane Williamson: 99వ పుట్టినరోజుకు ముందు.. వీరాభిమానికి కేన్‌మామ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌! ఫొటో వైరల్‌

Videos

కలర్ ఫుల్ బ్యూటీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం

Liquor Case: రాజకీయ కక్ష అని తేలితే...? సుప్రీం సీరియస్

Miss World 2025: అందం అంటే..!

మాట నిలబెట్టుకున్న జగన్.. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రిప్లై

సమంత లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్?

Photos

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)