Breaking News

భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌.. విలియ‌మ్స‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

Published on Tue, 12/23/2025 - 08:14

న్యూజిలాండ్ పురుషల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో మూడు వ‌న్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో కివీస్ త‌ల‌ప‌డ‌నుంది. తొలుత వ‌న్డే సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాట‌ర్ కేన్ విలియ‌మ్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్‌కు విలియమ్సన్‌ను దూరంగా ఉండనున్నాడు. 

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు కేన్ ఇప్పటికే డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుతో  ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్ డిసెంబర్ 26 నుండి జనవరి 26 వరకు జరగనుంది. ఈ లీగ్ కారణంగానే అతడు భారత్‌తో జరిగే వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి 11న ప్రారంభమై.. జనవరి 18న ముగియనుంది.

ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విలియమ్సన్‌.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్‌లలోనే కొనసాగుతున్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా వదులుకున్నాడు. ఎక్కవగా కుటంబంతో సమయం గడిపేందుకే కేన్ మామ ప్రాధాన్యత ఇస్తున్నాడు. 

గత నెలలలో వెస్టిం‍డీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యాడు. కానీ ఈ కివీ మాజీ కెప్టెన్ విండీస్‌తో టెస్టు సిరీస్‌లో మాత్రం మాడాడు. మౌంట్‌మంగనూయ్ వేదికగా విండీస్‌-న్యూజిలాండ్ మూడో టెస్టు ముగిసిన అనంతరం విలియమ్సన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.

"ఒక్కో సిరీస్‌కు కాస్త విరామం తీసుకుని మళ్లీ జాతీయ జట్టుకు ఆడుతాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలతో గడపడం నాకు చాలా ముఖ్యం. అయితే క్రికెట్ పట్ల నాకున్న మక్కువ ఇసుమంత కూడా తగ్గలేదు. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని, నా ప్రొపిషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా" అని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు వ్యూహాత్మక సలహాదారుగా కేన్ వ్యవహరించనున్నాడు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)