Breaking News

కౌంటీల్లో ఆడనున్న కేన్‌ మామ

Published on Tue, 02/18/2025 - 08:41

లండన్‌: న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కౌంటీ జట్టు మిడిలెసెక్స్‌తో జతకట్టాడు. ఇంగ్లండ్‌ దేశవాళీ టి20 కౌంటీ చాంపియన్‌షిప్‌ ఆడేందుకు రెండేళ్ల పాటు మిడిలెసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌లో జరిగే ఫ్రాంచైజీ లీగ్‌ ‘ది హండ్రెడ్‌ టోర్నీలో లండన్‌ స్పిరిట్‌కు కివీస్‌ దిగ్గజం సారథ్యం వహిస్తున్నాడు. గతంలో టి20 కౌంటీ చాంపియన్‌షిప్‌లో గ్లూసెస్టర్‌షైర్‌ (2011–12), యార్క్‌షైర్‌ (2013–2018)కు ప్రాతినిధ్యం వహించాడు. తాజా సీజన్‌లో బ్లాస్ట్‌ గ్రూప్‌లో మిడిలెసెక్స్‌ తరఫున కనీసం పది మ్యాచ్‌లు ఆడనున్నాడు. అనంతరం మరో ఐదు కౌంటీ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ల్లోనూ విలియమ్సన్‌ బరిలోకి దిగుతాడు.

‘గతంలో అడపాదడపా కౌంటీలు ఆడాను. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సీజన్‌కు అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. ఈ వెటరన్‌ బ్యాటర్‌ అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 18,000 పైచిలుకు పరుగులు చేశాడు. 47 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 54.88, వన్డేల్లో 49.65, టి20ల్లో 33.44 సగటు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో  సన్‌రైజర్స్, గుజరాత్‌ టైటాన్స్‌ ప్రాతినిధ్యం వహించిన విలియమ్సన్‌ కరీబియన్‌ లీగ్‌లో బార్బడోస్‌ ట్రిడెంట్స్, ఎస్‌ఏ–20 (సఫారీ లీగ్‌)లో డర్బన్‌ సూపర్‌జెయింట్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఈ సీజన్‌లో కరాచీ కింగ్స్‌ జట్టుతో జతకట్టిన కేన్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లోనూ ఆడనున్నాడు.    
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)